Thursday, November 21, 2024

ప్రజలు మాస్కులు, శానిటైజర్ వాడాలి: కేసీఆర్

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ లాక్‌డౌన్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రసంగం సందర్భంగా కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ వాడితే కరోనాను తరిమికొట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అటు రద్దీ ప్రదేశాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

స్వీయ క్రమశిక్షణతోనే కరోనాను నియంత్రించగలమని కేసీఆర్ అన్నారు. స్కూళ్ల నుంచి కరోనా విస్తరించే అవకాశం ఉన్నందున స్కూళ్లను బంద్ చేశామని తెలిపారు. అయితే స్కూళ్ల బంద్ తాత్కాలికమే అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, గురువారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 70వేల కరోనా టెస్టులు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు.గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా చాలా నష్టపోయామని కేసీఆర్ అసెంబ్లీలో వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement