Friday, November 22, 2024

నిషేధిత పాపులర్​ ఫ్రంట్​తో డెమోక్రటిక్​ పార్టీకి లింకుల్లేవ్​.. వెల్లడించిన ఎన్నికల కమిషన్​

సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI), నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కి మధ్య ఎలాంటి సంబంధాలు లేవని ఎన్నికల సంఘం తెలిపింది. భద్రతా కారణాలు, ఉగ్రవాద సంబంధాలతో బెదిరింపులను పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం PFI,  దాని అనుబంధ సంఘాలపై ఐదేళ్లపాటు నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద మొత్తం తొమ్మిది సంస్థలు చట్టవిరుద్ధమైనవిగా కేంద్రం పేర్కొంది. కానీ, PFI రాజకీయ శాఖ అయిన SDPI ఈ నిషేధం నుండి తప్పించుకుంది.

SDPI అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు PFI, SDPI మధ్య ఎటువంటి రిలేషన్​ ఉన్నట్టు గుర్తించలేదన్నారు. పిఎఫ్‌ఐపై చర్య గురించి మాకు తెలుసు అని, SDPI అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిందన్నారు. ఇప్పటి వరకు PFI, SDPIల మధ్య ఎటువంటి లింక్  కనిపించలేదని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.

సోషల్​ డెమోక్రాటిక్​ పార్టీ ఆఫ్​ ఇండియా (SDPI) 2009, జూన్ 21 న ఏర్పడింది. ఇది 2010 ఏప్రిల్ 13న భారత ఎన్నికల సంఘం ద్వారా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు SDPI కేరళ, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్‌లలోని మునిసిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలలో పోటీ చేసి గెలుపొందింది.  ఇక.. ముస్లింలు, దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీలతో సహా పౌరులందరి పురోభివృద్ధి.. సమానత్వం కోసం పార్టీ ఏర్పాటు అయ్యిందని, స్వతంత్రానంతర పరిణామాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, విశ్లేషించిన తర్వాత ప్రజలకు కొత్త రాజకీయ దృక్పథానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఆ పార్టీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement