తమిళ స్టార్ హీరో అజిత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు కూడా ఎన్నోసార్లు వచ్చాయి. ప్రతిసారి ఆ వార్తలను ఆయన ఖండించారు. తాజాగా మరోసారి ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తనకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపారు. ఇదే విషయంపై ఆయన పర్సనల్ మేనేజర్ సురేశ్ చంద్ర మాట్లాడుతూ.. అజిత్ కు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలను ప్రోత్సహించవద్దని మీడియాను కోరుతున్నామని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement