న్యూఢిల్లి: లోక్‌సభతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లిలలో డిప్యూటీ స్పీకర్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ విషయంలో సహాయం చేయాల్సిం దిగా అటార్నీ జనరల్ వెంకట రమణిని కూడా న్యాయస్థానం కోరింది. లోక్‌సభతోపాటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్‌లోని ఐదు రాష్ట్రాల అసెంబ్లిలలో రాజ్యాంగ బద్ధంగా నిర్దేశించిన డిప్యూటీ స్పీకర్ పదవులు ఏళ్లతరబడి ఖాళీగా ఉన్నాయంటూ న్యాయవాది షరీక్ అహ్మద్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీచేసేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. డిప్యూటీ స్పీకర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించడం, స్పీకర్ లేనప్పుడు ముఖ్యమైన పాలనా విధులు నిర్వహించడం వంటి కీలక బాధ్యతలు పోషిస్తారని చెప్పారు. కాగా దీనిపై సీజేఐ చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబి పార్దీవాలాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేయబడింది.
స్పీకర్ ఎన్నికైన తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 2019 నుంచి ప్రస్తుత లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాశీగా ఉంది. 10వ లోక్‌సభ వరకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ సాధారణంగా అధికార పార్టీకి చెందినవారు ఉండేవారు. కానీ 11వ లోక్‌సభలో స్పీకర్ అధికారపక్షం నుంచి ఎన్నికవుతుండగా, డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయానికి అనుగుణంగా 2014-19లో లోక్‌సభకు చివరి డిప్యూటీ స్పీకర్‌గా అన్నాడీఎంకేకు చెందిన తంబిదురై వ్యవహరించారు. 2004-09 వరకు అప్పటి బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌కి చెందిన చరణ్‌జిత్ సింగ్ అత్వాల్, 2009-14 వరకు బీజేపీకి చెందిన కరియా ముండా డిప్యూటీలుగా వ్యవహరించారు. రాష్ట్రాల అసెంబ్లిdలకు కూడా ఇలాంటి రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. ఆర్టికల్ 178 అసెంబ్లిd డిప్యూటీ స్పీకర్‌ను ప్రస్తావిస్తుంది. ఆర్టికల్ 179, 181 వారి అధికారాలు, నియామకం లేదా రాజీనామాను ఉటంకిస్తుంది.
ద్వైపాక్షిక సమస్య..
రాజ్యాంగ బద్ధమైన పదవితోపాటు, డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షానికి చెందినవారు కావడం వల్ల సభా కార్యకలాపాలకు కొంత వరకు న్యాయం జరుగుతుంది. అయితే, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోవడానికి అధికార పార్టీలు ఆసక్తి చూపడంలేదు. 2007-21 మధ్య కాలంలో యూపీలో 14 ఏళ్లు ఈ పదవి ఖాళీగా ఉంది. 2021లోఅసెంబ్లిd పదవీకాలం ముగింపునకు ముందర నితన్ అగర్వాల్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. గతేడాది మళ్లిd ఎన్నికల తర్వాత ఈ పదవి ఖాళీగా ఉంది. ఉత్తరాఖండ్, రాజస్థాన్ అసెంబ్లిdలు వరుసగా 2022, 2018 నుంచి డిప్యూటీ స్పీకర్ లేరు. మధ్యప్రదేశ్‌లో 2020లో ప్రభుత్వం మారిన తర్వాత ఆ స్థానం ఖాళీగా ఉందని పిటిషనర్ అహ్మద్ చెప్పారు.