కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడ్ గ్రామంలో వారం రోజుల నుండి మంచి నీళ్లు వస్తలేవు అని గ్రామ పంచాయతీ ముందు మహిళలు బిందెలతో ఇవ్వాల ధర్నా చేశారు. తాగు నీటి కోసం తంటాలు పడుతున్నాము. బోర్లు పని చేస్తలేవు ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని వాపోయారు, దయచేసి అధికారులు స్పందించి మంచినీటి సమస్యలను పరిష్కారం చేయాలని, ప్రతి ఇంటికి తాగు నీరు అందేలా కృషి చేయాలని కోరుతున్నారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథతో పాటు ఎత్తిపోతల పథకాలతో కృష్ణా గోదావరి జలాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తాగునీటి సమస్య తలెత్తడం, బిందెలతో ధర్నా చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని, అధికారులు వెంటనే ఇట్లాంటి సమస్య రాకుండా చూడాలని పలువురు లీడర్లు కోరుతున్నారు.