హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: రెండు ప్రభుత్వాల మధ్య సఖ్యత, సమన్వయం కొరవడిన కారణంగా ”ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం” అమలు విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోంది. విభజన ప్రక్రియ పూర్తయిన అనంతరం తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్నది ప్రాంతీయ పార్టీలే కావడంతో, నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. సరైన సమయం, సందర్భం వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ఇటు తెలంగాణాలో రెండుసార్లు అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం, అటు ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం, అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయిని రాజకీయ, సామాజిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంగానే విభజన చట్టం ఫలాలను తెలుగు రాష్ట్రాలు అందుకోలేకపోయాయి. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా కక్షపూరిత దోరణితో వ్యవహరిస్తోంది. ఉద్యమిస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు లేవన్న భావనను పెంపొందిస్తోంది. తెగేదాకా లాగే ఈ విధానం, సాగదీత దోరణి రెండు ప్రభుత్వాలకూ కష్ట, నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. పార్లమెంట్‌లో ఆమోదించిన ఏపీ పునర్విభజన చట్టం-2014లోని అనేక అంశాలు తొమ్మిదేళ్ళ కాలం గడిచిన తర్వాత కూడా పరిష్కారం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 9వ షెడ్యూల్ కింద పేర్కొన్న 91 సంస్థలు, పూర్తిగా విఫలమయ్యాయిని రాజకీయ, సామాజిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంగానే విభజన చట్టం ఫలాలను తెలుగు రాష్ట్రాలు అందుకోలేకపోయాయి. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా కక్షపూరిత దోరణితో వ్యవహరిస్తోంది. ఉద్యమిస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు లేవన్న భావనను పెంపొందిస్తోంది. తెగేదాకా లాగే ఈ విధానం, సాగదీత దోరణి రెండు ప్రభుత్వాలకూ కష్ట, నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. పార్లమెంట్‌లో ఆమోదించిన ఏపీ పునర్విభజన చట్టం-2014లోని అనేక అంశాలు తొమ్మిదేళ్ళ కాలం గడిచిన తర్వాత కూడా పరిష్కారం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
9వ షెడ్యూల్ కింద పేర్కొన్న 91 సంస్థలు, 10వ షెడ్యూల్ కింద పేర్కొన్న 142 సంస్థలు నేటికీ సందిగ్ధంలోనే పనిచేస్తున్నాయి. అనేక సందర్భాల్లో ప్రధానిని కలిసి వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. పునర్విభజన చట్టం-2014 షెడ్యూల్ 9లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లతో పాటు- 91 సంస్థలను, అదేవిధంగా షెడ్యూల్ 10లోని ఏపీ స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్‌తో పాటు- 142 సంస్థల్లోని ఆస్తులు, ఇతర లావాదేవీలను 48:52 ప్రకారం విభజించాల్సి ఉన్నది. కానీ కేంద్రం దేన్నీ తేల్చకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్నది. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో మొత్తం 91 సంస్థల్లో షీలా బీడే కమిటీ- 68 సంస్థలకు చెందిన ఆస్తులను పాక్షికంగా పంచింది. కానీ రాష్ట్రం ఏకీభవించని 22 సంస్థల విభజనపై బీడే కమిటీ- చేసిన సిఫార్సులను రెండు రాష్ట్రాలూ అంగీకరించలేదు. ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తులే 89 శాతం ఉంటాయని అధికారులు చెబున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ షెడ్యూల్లోనూ లేకుండా మరో 32 సంస్థలు ఉన్నాయి. వాటిని రెండు రాష్ట్రాలు పంచుకోవడం ఇబ్బందిగా, సమస్యాత్మకంగా మారింది. ఆస్తులను జనాభా నిష్పత్తికి అనుగుణంగా సెక్షన్ 64 ప్రకారం పంచుకోవాలని ఏపీ వాదిస్తోంది. తెలుగు యూనివర్సిటీ-, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-, తెలుగు అకాడమీ, జేఎన్‌యూ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ-ల విభజన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు- సమస్య కొనసాగుతూనే ఉంది.
నేటికీ నివేదిక ఇవ్వని నీరజా మాథూర్ కమిటీ
రెండు ప్రభుత్వాలను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించలేని క్రమంలో అప్పట్లో కేంద్రం నియమించిన కమిటీలు కూడా సరిగ్గా పనిచేయలేక పోతున్నాయి. విద్యుత్ రంగ సమస్యల పరిష్కారానికి నీరజా మాథుర్ అధ్యక్షతన ఏర్పా-టైన కమిటీ- ఇప్పటికీ రిపోర్ట్ ఇవ్వలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి వాటి విభజన పూర్తిగా జరగలేదు. ఫిల్మ్ డెవలప్‌మెంట్, టీ-ఎస్ ఎంఎస్‌ఐడీసీ, మినరల్ డెవలప్మెంట్ సంస్థ వంటి ఆస్తుల పంపకాలపైనా గందరగోళం నెలకొంది. కొన్ని సంస్థల్లో జాయింట్ అకౌంట్ల కింద ఫిక్స్‌డ్ డిపాజిట్లు- రూ.2 వేల కోట్ల వరకు ఉన్నాయి. వాటిపై స్పష్టత లేదు. 2014 నుండి, చట్టంలోని వివిధ నిబంధనల అమలు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో మొత్తం 29 సమీక్షా సమావేశాలను నిర్వహించింది. అయినప్పటికీ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇరు రాష్ట్రాలు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సాధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇటు రాష్ట్రాలూ అదే దోరణిని అవలంభిస్తున్నాయి.
అంతకంతకూ ముదురుతున్న నదీ జలాల సమస్య
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. గోదావరి, కృష్ణా నదీజలాల వాటాల పంపిణీలోనూ కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నది. దేశంలోని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తి నప్పుడు రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్, 262 ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల నదీ జలాల వివాదాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. 575 టీ-ఎంసీల నీటి వాటా కోసం కృష్ణా నదీ జలాల పంపకం అంశాన్ని ట్రిబ్యునల్‌కు పంపాలని తెలంగాణ కొన్నేండ్లుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ అభ్యర్థనలన్నిటినీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తున్నది. తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా, కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. కాగా ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టుకు జాతీయ హోదా మంజూరు చేసింది. అలాగే ఏపీలోని పోలవరానికీ జాతీయ హోదా ఇచ్చింది. కానీ తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపింది. ఉన్న చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నవోదయ పాఠశాలలు ఇవ్వకపోగా తెలంగాణకు మంజూరైన ఐటీ-ఐఆర్‌ను కూడా కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారు ఎదురుతిరిగి పోరాటం మొదలుపెట్టారు.
పరిశీలనకే పరిమితమైన తెలంగాణ విన్నపాలు
విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వినతులు కలిపి మొత్తం 150కి పైగా కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్నాయి. పార్లమెంటు- సమావేశాల్లో వీటిని ప్రస్తావించడంతో పాటు- కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు, స్థాయీ సంఘ సమావేశాల్లోనూ చర్చించేందుకు వీలుగా ఈ అంశాలపై బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నివేదిక రూపొందించి తన పార్టీ ఎంపీలకు అందజేశారు.
- తొమ్మిది, పదవ షెడ్యూలు సంస్థల విభజన, గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే కోచ్‌ల కర్మాగారం, బయ్యారం ఉక్కు కర్మాగారం, ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు, జాతీయ శాస్త, విద్యా పరిశోధన సంస్థ ఏర్పాటు-, హైదరాబాద్‌లో ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూముల కేటాయింపు, వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధి కింద రూ.450 కోట్ల బకాయిలను కేంద్రం తక్షణమే చెల్లించాలి.
- మిషన్ భగీరథ, కాకతీయలకు నీతిఆయోగ్ సిఫార్సు చేసిన రూ.19,205 కోట్ల చెల్లింపు, మిషన్ కాకతీయ నిర్వహణకు ఏటా రూ.1000 కోట్ల చెల్లింపులు, జాతీయ ఆకృతి సంస్థ (ఎన్‌ఐడీ), ఐఐఎం ఏర్పాటు-, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, సింగరేణి బొగ్గు గనులను విద్యుత్ కేంద్రాల అవసరాలకు కేటాయించడం, 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.2027 కోట్ల బకాయిలు, ఐటీ-ఐఆర్‌కు అనుమతి ఇవ్వాలి.
- జహీరాబాద్ నివ్జ్‌ుకు రూ.5000 కోట్ల కేటాయింపు, వరంగల్ మెగా జౌళి పార్కుకు కేంద్రం నిధులు, ఔషధనగరికి సాయం, ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ, ప్రధానమంత్రి కిసాన్ సంచాయి యోజనలో ఎస్సారెస్పీ వరద కాల్వను చేర్చాలని విజ్ఞప్తులను కేంద్రం ఆమోదించాలి.
- అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు, కరీంనగర్‌లో ట్రిపుల్‌ఐటీ-, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, సీతారామ ప్రాజెక్టుకు నిధులు, రైల్వే ప్రాజెక్టు, జాతీయ రహదారుల పనులకు బడ్జెట్ మంజూరు చేయాలి.
- హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెంపు, రామప్ప దేవాలయానికి జాతీయ వారసత్వ గుర్తింపు హైదరాబాద్ చుట్టూ రెండో ఓఆర్‌ఆర్ నిర్మాణం, పౌరసరఫరాల సంస్థకు బకాయిల చెల్లింపు, కొత్త పోలీసు రిజర్వ్‌బెటాలియన్ల ఏర్పాటు- వంటివి డిమాండ్లను కేంద్రం పరిష్కరించాలి.