Saturday, November 23, 2024

సౌండ్ రాదు లైటింగ్ లేదు.. ఎలుగందల ఖిలాపై చిన్న చూపు

కరీంనగర్ తొలి రాజధాని ఎలుగందను పాలకులు విస్మరిస్తున్నారు. 2017 జనవరి 25న సరిగ్గా ఐదేళ్ల క్రితం 3. 22 కోట్ల రూపాయలతో సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. తొలి రాజధాని చరిత్రను తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఈ ఏర్పాటు మున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది.

ఎలగందల్ కోటను వెలగందుల అని కూడా పిలుస్తారు. దీనిని కాకతీయుల (1083-1323) కాలంలో నిర్మించారు. యోధులైన ముసునూరి నాయక్, రాచర్ల పద్మనాయక్ లు దీనిని దృఢంగా చేశారు. 16వ శతాబ్దంలో కుతుబ్ షాహి వంశస్థులు ఈ కోటను ఆక్రమించుకొని, క్యుయినముల్ ఉల్ ను కమాండర్ గా నియమించారు. తదనంతరం, మొఘల్ సామ్రాజ్య ఆధీనంలోకి వెళ్లింది. హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ నిజాం అసఫ్జాహ్ I (1724-1748), ముగర్రాబ్ ఖాన్ హయాంలలో, అమిన్ ఖాన్ ఎలగందల్ కు ఖిలేదార్ గా నియమించబడ్డాడు. నవాబ్ సలాబత్ జంగ్ హయాంలో మిర్జా ఇబ్రహీం దంసా ఖిలేదార్ అయ్యాడు. సికందర్ ఝా (1803-1823) హయాంలో 1754 లో దంసా ఈ కోటను పునర్నిర్మాణం చేశాడు. బహదూర్ ఖాన్, కరీముద్దీన్ లు తరువాతికాలంలో ఖిలేదార్లుగా పనిచేశారు. కరీముద్దీన్ పేరుమీద కరీంనగర్ గా మారింది. 1905 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా, ఆరవ నిజాం మహాబుబ్ ఆలీ ఖాన్ జిల్లా కేంద్రాన్ని ఎలగందల్ నుండి కరీంనగర్ కి మార్చారు.

శత్రువుల నుండి దాడులను నిరోధించడానికి ఎలగందల్ పాలకులు కోట చుట్టూ సుమారు 5 మీటర్లు (16 అడుగులు) వెడల్పు, 4 మీటర్లు (13 అడుగులు) లోతైన నీటి కందకాన్ని ఏర్పాటుచేసి అందులో మొసళ్లను వదిలేవారు.[2]
ఈద్ ప్రార్థనల కొరకు ప్రత్యేక మసీదును కూడా ఈ కోటలో నిర్మించారు.ఈకోటను పర్యాటక కేంద్రంగా మార్చాలని, సౌండ్ అండ్ లైటింగ్ సిస్టంను పురుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement