Thursday, November 21, 2024

కరోనా పాజిటివ్ వచ్చిన 95 శాతం మందిలో లక్షణాలు లేవు

సూర్యాపేట కలెక్టరేట్‌లో ఉమ్మడి నల్గొండ వైద్య అధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ కోవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా గ్రామీణ తెలంగాణలో మాత్రం పెద్దగా కేసులు లేవని ఈటెల తెలిపారు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి కేసులు నమోదు అవుతున్నాయన్నారు.

మహారాష్ట్రను ఆనుకుని ఉన్న జిల్లాలలో కేసులు ఉన్నాయని, పాజిటివ్ నిర్ధారణ అయిన 95 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవన్నారు. 5 శాతం మందికి మాత్రమే ఆస్పత్రుల్లో డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం కొనసాగుతుందని ఈటెల వెల్లడించారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఎలాంటి బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, డాక్టర్స్ కొరత, రెమిడెసివిర్ కొరత లేదని స్పష్టం చేశారు. కరోనా బాధితులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా పర్లేదని ఈటెల వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రజలు అనవసరంగా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సమీక్ష నిర్వహించి నైట్ కర్ఫ్యూ విధించిందని, ప్రజలు సహకరించాలని ఈటెల కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement