Saturday, November 23, 2024

బీహార్ లో నో క‌రోనా ఆంక్ష‌లు – మాస్క్ మ‌స్ట్

క‌రోనా కేసులు రోజు రోజుకి త‌గ్గుతున్నాయి. దాంతో క‌రోనా ఆంక్ష‌లు విధించిన ప‌లు రాష్ట్రాలు ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్నాయి. తాజాగా బీహార్ లో క‌రోనా ఆంక్ష‌ల‌న్నింటినీ ఎత్తివేసింది.ఆంక్షలన్ని ఎత్తేస్తామని బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్ర‌కటించారు. విపత్తు నిర్వహణ బృందంతో నితీష్ కుమార్ భేటీ అయ్యారు. ఆ సమావేశం అనంతరమే ఆయన సంచలన ప్రకటనలు చేశారు. అన్ని తరగతులకు స్కూల్స్ సాధారణంగానే రన్ అవుతాయని వివరించారు. అలాగే, వివాహాలు, అంత్యక్రియలు వంటి వాటికీ హాజరయ్యే వారిపై లిమిట్ ఎత్తేసింది. ఇప్పుడు ఏ వేడుకకైనా ఎంత మందైనా హాజరుకావచ్చని తెలిపారు.

గతంలో పెళ్లి వేడుకలకు 200 మందికి మించి హాజరు కావొద్దనే నిబంధన ఉన్నది. అలాగే, స్కూల్స్‌లోనూ 8వ తరగతి వరకు విద్యార్థులు 50 శాతం కెపాసిటీతో తరగతులు నిర్వహించవచ్చనే సడలింపు ఉన్నది. తాజాగా ఆ నిబంధనలు పూర్తి ఎత్తేసింది. సోమవారం అంటే ఫిబ్రవరి 14వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇదిలా ఉండగా, కరోనా నిబంధనలు అంటే.. అప్రొప్రియేట్ బిహేవియర్ ఎప్పటిలాగే పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అంటే ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు అమల్లోనే ఉంటాయని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement