తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనాతో పట్టణాలు, గ్రామాలు వణికిపోతున్నాయి. పట్ణణాల్లో కంటే పల్లెల్లోనే కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే, తెలంగాణలోని ఓ పల్లెటూరులో మాత్రం ఇంతవరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. అవును మీరు విన్నది నిజమే.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాగోజిపేట్ గ్రామంలో 382 కుటుంబాలు నివాసం ఉండగా…1100 మంది ప్రజలు ఉన్నారు. అయితే వారి ఇళ్లులు కూడా దూరం దూరంగా ఉంటాయి. మనిషి, మనిషికి మధ్య చాలా దూరం ఉంటుంది. అయినా అక్కడ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తారు. మాస్క్ లు, శానిటైజర్లు వాడుతున్నారు.
మొదటి వేవ్ లో ఆ గ్రామంలో మూడు కేసులు నమోదవ్వగా అప్పటి నుంచి ఇప్పటి వరకు విధిగా మాస్క్ లు ధరిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ తమ గ్రామాన్ని కాపాడుకుంటూ సెకంట్ వేవ్ లో కరోనా ఫ్రీ విలేజ్ గా పేరుపొందంది. కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఈ గ్రామస్తులు జాగ్రతలు తీసుకుంటున్నారు. గ్రామంలోకి ఇతర గ్రామాల వారు రానివ్వకుండా చేయడం వంటివి చేపట్టారు. ఈ క్రమంలో ఎవరైనా కొత్తవారు ఊళ్లోకి వస్తే తగిన జాగ్రత్తలు తీసకుంటున్నారు. వారి ఆపి మాస్క్ , శానిటైజర్ ఇచ్చి ఎక్కువ సేపు వారి ఊరిలో ఉంచకుండా తొందరగా బయటకు పంపిస్తున్నారు. అంతేకాకుండా బయటకు వెళ్లి వచ్చిన ప్రతీ ఒక్కరు పసుపు నీళ్లతో స్నానం చేసి ఇంట్లోకి వెళ్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మూడు పూటలా వేడి నీళ్లను సేవిస్తున్నారు. ఆ గ్రామ సర్పంచ్ సహకారంతో ఊరి జనాలు నిబంధనలు పాటిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో హైపోక్లోరైడ్ చల్లించడం, డ్రైనేజీ పనులను, శానిటేషన్ వర్క్ ను దగ్గరుండి చూసుకోవడం చేస్తున్నారు.