గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట కలిగించేలా ధరల విషయంలో ఆయిల్ మర్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలను పెంచకుండా అలాగే స్థిరంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెల మొదటి తేదీ రోజు ఆయా కంపెనీలు సిలిండర్ ధరలలో మార్పు చేర్పులపై నిర్ణయం తీసుకుంటాయన్న విషయం తెలిసిందే. అయితే, మే 1న గ్యాస్ సిలిండర్ ధరలను పెంచకుండా అలాగే స్థిరంగా కొనసాగించాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఎల్‌పీజీ కస్టమర్లకు ఇది ఊటర కలిగించే అంశం.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.809గా ఉంది. కోల్ కతాలో సిలిండర్ ధర రూ.835, ముంబైలో రూ.809, చెన్నైలో రూ.825 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 861 వద్ద కొనసాగుతోంది. కాగా, గత నెలలో సిలిండర్ ధర రూ.10 తగ్గిన విషయం తెలిసిందే.