Tuesday, November 26, 2024

Gold Prices: స్థిరంగా బంగారం ధర.. వెండి రేట్ ఎంతంటే..

పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్. నిన్నమొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధర… స్వల్ప ఊరటనిచ్చింది. ఇప్పటికే బంగారం ధ‌ర రూ. 48 వేలు దాటింది. అయితే, శుక్రవారం బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. బంగారం ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల‌ బంగారం ధ‌ర రూ. 44,550 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,600 గా ఉంది. బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నా, వెండి మాత్రం కొంత‌ పెరిగింది. కిలో వెండి ధ‌ర రూ. 100 పెరిగి 67,700 కి చేరింది.

దేశ రాజ‌ధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,700 గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర 50,900గా ఉంది. ముంబాయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.44, 470 ఉంగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల‌కు రూ. 47,410గా ఉంది. ఇక, కోల్ క‌త్తలో 22 క్యారెట్ల 10 గ్రాముల‌కు రూ. 47,850కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల‌కు రూ. 50,550గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement