Monday, November 18, 2024

Gold News: స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధరలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నిన్న పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు ఈ రోజు కాస్త ఊరటనిచ్చాయి. ఇవాళ్టి బంగారం ధ‌ర‌లలో ఎలాంటి మార్పులు లేదు. పసిడి రేటు స్థిరంగా ఉంది. అలాగే వెండి ధ‌ర రూ. 100 వ‌రకు త‌గ్గింది.

హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర నిలకడగానే కొనసాగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. బంగారం ధర రూ.49,040 వద్దనే కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,950 వద్ద స్థిరంగా ఉంది. వెండి రేటు రూ.100 తగ్గడంతో కేజీ వెండి రేటు రూ.65,500కి చేరింది.

విజ‌య‌వాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,040 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,950 గా ఉంది. అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,500 గా ఉంది. ఇక, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,840 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,840 గా ఉంది. కిలో వెండి ధ‌ర రూ. 61,600గా కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement