ఒకరోజు నో బ్యాగ్ డే అని ప్రకటించింది చెన్నైలోని మహిళా క్రిస్టియన్ కాలేజ్. ఈ మేరకు విద్యార్థులతో ఫన్ యాక్టివిటీని కాలేజీ యాజమాన్యం నిర్వహించింది. కాలేజ్ కి బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. దీంతో అమ్మాయిలు పండుగ చేసుకున్నారు. నో బ్యాగ్ డేని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. చాన్స్ దొరికిందని అమ్మాయిలు తమ క్రియేటివిటీని బయటపెట్టారు. పుస్తకాలు తప్ప మిగతావన్నీ కాలేజీకి పట్టుకొచ్చారు. కొందరైతే ప్రెషర్ కుక్కర్లు తీసుకొచ్చారు. ఇంకొందరు బకెట్లు, సూట్ కేస్ లు, లాండ్రీ బాస్కెట్స్, షూ బాక్స్‌లు వంటివి కాలేజీకి తెచ్చారు.ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. 17 లక్షల మందికి పైగా చూశారు. 1.3 లక్షల మంది లైక్ కొట్టారు. వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు. విద్యార్ధినుల సృజనాత్మకతను ఇన్‌స్టా యూజర్లు ప్రశంస్తున్నారు. ఐడియా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. అండ్ ది అవార్డు గోస్ గు బకెట్ గర్ల్ అంటూ చమత్కరిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement