Monday, November 18, 2024

TS | మెడిసిటి మెడికల్‌ కాలేజీకి ఎన్‌ఎంసి ఝలక్‌.. అడ్మిషన్స్‌ నిలిపివేస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మెడిసిటి మెడికల్‌ కాలేజీకి నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఝలక్‌ ఇచ్చింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్‌ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం ఎలాంటి అడ్మిషన్లు స్వీకరించవద్దని కళాశాల యాజమాన్యానికి ఆదేశాలిచ్చింది.

కౌన్సిలింగ్‌లోనూ కాలేజీ పేరు తొలగించింది. కాగా, ఈ మెడికల్‌ కాలేజీని హైదరాబాద్‌ శివార్లలోని మల్కాజ్‌గిరి ఘన్‌పూర్‌లోని మెడిసిటి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పేరిట బీజేపీ ఎంపి సుజనా చౌదరి 2002లో ఏర్పాటు చేశారు. ఈ కాలేజీకి ప్రతీ ఏటా వంద మెడికల్‌ అడ్మిషన్లను యూనివర్సిటీ కౌన్సిలింగ్‌ ద్వారా కేటాయించే వారు. ఫిబ్రవరి 2017 నుంచి సీట్ల సంఖ్య 140కి పెరిగింది. ప్రస్తుతం ఈ కాలేజీలో 750 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, 150 మంది పీజీ విద్యార్థులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement