ఉత్తర్ప్రదేశ్ ఫరూఖాబాద్ జైలులో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోటి ఖైదీ మరణించిన వార్త విన్న ఖైదీలు ఆవేశంతో జైలు సిబ్బందిపై దాడి చేసి జైలుకు నిప్పుపెట్టారు. జైలులోని పోలీసు సిబ్బందిపై ఖైదీలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 30మంది పోలీసులు, ఆరుగురు ఖైదీలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో డిప్యూటీ జైలర్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జైలులో పరిస్థితిని అదుపు చేసినట్టు చెప్పారు.
డెంగీ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురైన సందీప్ అనే ఖైదీ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త జైల్లో ఉన్న మిగితా ఖైదీలకు ఆవేశంతో జైలు వింధ్వంసం సృష్టించారు.