టాలీవుడ్ లో మలయాళి ముద్దుగుమ్మల హవా కొనసాగుతోంది..ఇప్పటికే పలువురు మలయాళీ భామలు హల్ చల్ చేస్తున్నారు. వారిలో ఒకరు నివేదా థామస్. నేడు నివేదా థామస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ మీకోసం. అందానికి అందంతో పాటు మంచి నటన కూడా ఈ అమ్మడి సొంతం. ఈ బ్యూటీ 2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసింది.. సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ మై డియర్ బూతంలో కూడా నటించింది. మలయాళం సినిమా ‘వెరుథె ఒరు భార్య’ సినిమాలో జయరాం కుమార్తెగా నటించింది. సముద్ర ఖని దర్శకత్వంలో 2011లో పొరాలీ అనే సినిమాలో పెట్రోల్ బంక్ ఉద్యోగినిగా చేసింది..అంతకు ముందే అరసి అనే డ్రామా సిరీస్ లో సముద్రఖని తో కలసి నటించింది.
సినిమాల్లోకి హీరోయిన్ గా అడుగుపెట్టకముందు మోడల్ గా కూడా చేశారు. అలా మోడల్‌గా రాణిస్తూ మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో సినిమా అవకాశాలను దక్కించుకుంది. 1995, నవంబర్ 2న జన్మించింది ఈ ముద్దుగుమ్మ. నివేదాను ఇంట్లో అందరూ బేబీ అని పిలుస్తారట. పుట్టింది కేరళలోనే అయినా విద్యాభ్యాసం మొత్తం తమిళనాడులోని చెన్నలోనే జరిగిందట. నేచురల్ స్టార్ హీరో నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్ మెన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నివేదా.. ఆ చిత్రంలో తన అందం..నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో అనతి కాలంలోనే తెలుగులోనూ మంచి నటిగా గుర్తింపు సంపాదికుంది.
ఆ చిత్రం తర్వాత నిను కోరి, జైలవకుశ, 118, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. మలయాళంలో వచ్చిన వెరుథె ఒరు భార్య సినిమాలో అద్భుత ప్రదర్శనను కనబరిచిన నివేదా.. కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారాన్ని అందుకుంది. వీటితో పాటు పలు అవార్డులను సైతం అందుకుంది ఈ బ్యూటీ. సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న నివేదా.. ఇటీవల ఓ అరుదైన ఘనతను సాధించింది. ఆఫ్రికాలో ఎత్తైన పర్వతం కిలిమంజారోను అధిరోహించి అందరి దృష్టిని ఆకర్షించింది. కిలిమంజారోని అధిరోహించాలనే కలని సాకారం చేసుకుంది.
కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది నివేదా. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ప్రస్తుతం మీట్ క్యూట్, మిడ్‌నైట్ రన్నర్స్ రిమేక్‌గా తెరకెక్కుతున్న మరో మూవీలో కూడా నివేదా నటిస్తోంది. చిన్న వయసు నుంచే హీరోయిన్ కావాలన్న కోరిక నేపథ్యంలో అటు చదువును, ఇటు కరియర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు షూటింగ్ వెళ్లి ఆ మేకప్‌తోనే నే క్లాస్‌కు హాజరైన సందర్భాల చాలా ఉన్నాయని ఆమె స్వయంగా తెలిపింది.