Sunday, November 17, 2024

10ల‌క్ష‌ల మందితో నిత్యానంద సేన -రూ.ల‌క్ష వ‌ర‌కు వ‌డ్డీలేని రుణాలు

తాను మ‌ర‌ణించిన‌ట్లు ప‌లువురు ప‌నిగ‌ట్టుకుని మ‌రీ సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌న్నారు స్వామి నిత్యానంద‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు స్పష్టం చేశారు. నాలుగు నెలల నుంచి తాను చనిపోయినట్టు తప్పుడు వార్తలు వస్తున్నాయన్నారు తన వయస్సు 44 సంవత్సరాలని.. నేను ఈ నాలుగు నెలల వ్యవధిలో చాలా విషయాలు తెలుసుకున్నాన‌న్నారు. దేవుడి తనకిచ్చిన మరో జన్మలో తాను చేసే పనులు ఎవరూ ఊహించలేరని పేర్కొన్నారు. తాను జనం కోసం చేస్తున్న మంచి పనులను ఎవరూ చేయలేరన్నారు. హిందువుల పరిరక్షణ కోసం మైక్రో ఫైనాన్స్ విధానం తీసుకొస్తున్నట్టు నిత్యానంద చెప్పారు. లక్ష రూపాయిల వరకు వడ్డీలేని రుణాలు ఇప్పిస్తామంటూ నిత్యానంద సెన్సెషనల్ కామెంట్ చేశారు.అన్నిదేశాలలో కలిపి 10 లక్షల శివాలయాలు నిర్మిస్తామని స్వామి నిత్యానంద ప్రకటించారు. నిత్యానంద ఆర్మీలో చేరాలని యువతకి పిలుపునిచ్చారు. 10 లక్షల మందితో నిత్యానంద సేనని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధంచేశామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement