న్యూఢిల్లి : రాబోవు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్‌ను కలిపే మరో ప్రయత్నంలో కాంగ్రెస్, జనతాదళ్ (యునై టెడ్), రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేతలు ఢిల్లిలో సమావేశమయ్యారు. అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు ఫ్రంట్ సమాయాత్తవుతోంది. ఈ సమావేశం లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు ఖర్గే, బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ ఛైర్‌పర్సన్ తేజస్వీ యాదవ్ హాజర య్యారు. వారితో పాటు జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్, ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షా లన డీఎంకే, ఎన్‌సీపీలను కూడా తమతో చేర్చుకొవాలని నిర్ణయించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో చర్చలు జరపాలని నితీశ్ కుమార్ సూచిం చారు. అయితే, టీఎంసీ, ఆప్, బీఆర్‌ఎస్ తో దూరంగా ఉంటున్న విషయం ప్రస్తావనలోకి వచ్చింది. విసృత ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ప్రతిపక్ష పార్టీల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం ఖర్గే మీడి యాతో మాట్లాడుతూ, ఇది చారిత్రాత్మకమని, రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. రాహాల్ గాంధీ మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు ఇది చారిత్రాత్మమైన అడుగు అన్నారు. ఇది దేశం పట్ల ప్రతిపక్ష దృష్టిని పెంపొందిస్తోం దన్నారు.
జేడీయూ చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్ కూడా దీనిని చారి త్రక సమా వేశంగా అభివర్ణించారు. ఢిల్లిలో పర్యటిస్తున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్, వీలైనన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి కలిసిి పని చేయాలనే ప్రయత్నిస్తా మన్నారు. సమావేశానికి ముందు ఆయన లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి నివాసంలో ఆర్జేడీ అధ్యక్షుడిని కలిశారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోడానికి కొత్త సమీకరణాలను అన్వేషిస్తున్నాయి. అయితే కొన్ని పార్టీలు ఫ్రంట్‌లో చేరే ప్రశ్నపై తమ స్టాండ్‌ను క్లియర్ చేయగా, మరికొన్ని మిశ్రమ సంకేతాలను పంపాయి. రాహుల్ గాంధీ తన మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలపై క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత పార్టీలు తమ వైఖరీని మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది.
నితీశ్ కుమార్, తేజస్విని యాదవ్‌తో కేజ్రివాల్ సమావేశం..
ఢిల్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌లతో సమావేశమైయారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్, ప్రస్తుత ప్రభుత్వాన్ని అధికారంలోంచి దించడం అన్ని ప్రతిపక్షాలకు చాలా ముఖ్యమైందని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ కేజ్రీవాల్, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్రంలో ఇది బహుశా అత్యంత అవినీతి ప్రభుత్వంమని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు నితీశ్ కుమార్ చేస్తున్న ప్రయత్నాన్ని కేజ్రీవాల్ కొనియాడారు. నేను ఆయనతో పూర్తిగా ఏకీభవిస్తాన్నారు. నేను గతంలో ఢిల్లి సీఎం కేజ్రీవాల్‌తో మాట్లాడాని, మళ్లి నేడు ఆయన్ను కలిశానని నితీశ్ కుమార్ అన్నారు. మేము ప్రతిపక్ష పార్టీల దృక్పథాన్ని పెంపొందించుకుంటాం. ముందుకు సాగుతామని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమవ్వాల్సిన తరుణం ఇది, అందరం కలిసి ముందుకు వెళ్తాం. దేశం కోసం సైద్ధాంతిక పోరాటంలో ఉన్నామని కేజ్రీవాల్ అన్నారు.
ఫ్రంట్‌కు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్టాండ్ ఏమిటీ..?
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యతిరేకంగా, అదానీకి అనుకూలంగా మాట్లాడుతున్న ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, ప్రతిపక్ష ఫ్రంట్‌తో కలిసి వస్తారనే దానిపై సర్వత్రా విభిన్న వాదనలు వినవస్తున్నాయి. ప్రధాని మోడీ విద్యార్హతలపై రాహుల్ గాంధీ లేవనెత్తిన అనుమాలను శరద్ పవార్ ఖండించారు. దేశానికి సరైన నాయకత్వం ఉంటే చాలని, విద్యార్హతలతో పనేంటని ఆయన అంటున్నారు. దేశంలో అనేక సమస్యలున్నాయి. రాహుల్ గాంధీ అనవసరంగా మోడీ విద్యార్హతలను ప్రస్తావించడం సరైనది కాదని పవార్ అభిప్రాయపడుతున్నారు. వవార్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడంపై తోటి ప్రతిపక్ష నేతలు షాక్ అవుతున్నారు.