నీతి ఆయోగ్ పెద్ద జోక్ గా మారిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రణాళికా సంఘానికి ప్రత్యామ్నాయంగా నీతి ఆయోగ్ ను మోడీ సర్కార్ తీసుకొచ్చిందన్నారు. నీతి ఆయోగ్ సూచనలను కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయన్నారు. మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించిందన్నారు. నీతి ఆయోగ్ కు వ్యూహం లేదని, ఇందులో రాష్ట్రాల పాత్ర లేదన్నారు. నీతి ఆయోగ్ నిరర్ధక సంస్థగా మారిపోయిందన్నారు. ప్రధాని చెప్పే వాటికి భజన మండలిగా మారిపోయిందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement