Friday, November 22, 2024

మోదీ బొమ్మతోనే ఉచిత రేషన్‌ పంపిణీ: నిర్మలా

రేషన్‌ దుకాణాల వద్ద ప్రధాని మోదీ ఫొటో ఎందుకు ఉంచలేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ ద్వారా అందజేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ సమయంలో ప్రధాని మోదీ బొమ్మతో కూడిన బోర్డు తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తోందనే విషయం ప్రజలకు తెలియజేయాలన్నారు. విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం రేషన్‌ డిపోను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పరిశీలించారు. ‘’ రేషన్‌ దుకాణాల వద్ద ప్రధాని మోదీ ఫొటో ఎందుకు ఉంచలేదు? కేంద్రం ‘గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ పథకం కింద బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోందన్న సమాచారం ప్రజల్లోకి వెళ్లిందా?’’  అంటూ నిర్మలా సీతారామన్‌… అధికారులు, రేషన్‌ డీలర్‌పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మే, జూన్‌లో ప్రధాని ఫొటో లేకుండానే బియ్యం పంపిణీ చేయడమేంటని మంత్రి ప్రశ్నించారు.  కేంద్రం వాటా రేషన్‌ దుకాణాల వద్దే ఇవ్వాలని తెలిపారు. ఇచ్చేటప్పుడు అన్ని దుకాణాల్లోనూ పీఎంజీకేఏవై బోర్డులు ప్రదర్శించాలని అధికారులను నిర్మలా ఆదేశించారు. 

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మొదటి దశ, రెండవ దశ(ఏప్రిల్-నవంబర్ 2020) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటివరకు 2.61 కోట్ల మంది లబ్ధిదారులకు 9.95 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారాధాన్యలు అలాగే 90.3 లక్షల లబ్ధిదారులకు 66,492 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యలు అందించినట్లు నిర్మలా వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement