ఇతర దేశాలకు 5జీ టెక్నాలజీని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
భారత దేశంలో 5జీ టెలికాం సర్వీసులను ప్రారంభించడం తమకు గర్వ కారణమన్నారు. 5జీ టెక్నాలజీని పూర్తిగా స్వదేశీయంగా అభివృద్ధి చేశామన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ శుక్రవారం అక్కడి జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో విద్యార్థులతో మాట్లాడారు. భారత్ లో ఇటీవల 5జీ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ఆ అంశాన్ని ప్రస్తావించారు. భారత దేశంలో 5జీ సేవలను ప్రారంభించినా.. ఇంకా ప్రజలకు పూర్తిస్థాయిలో అందాల్సి ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 5జీ టెక్నాలజీలో చాలా భాగం దేశంలోనే అభివృద్ధి చేశామని.. దక్షిణ కొరియా వంటి ఇతర దేశాల నుంచి కొన్ని పరికరాలను మాత్రం తెప్పించుకున్నామని వివరించారు. 5జీ విషయంగా భారత్ విజయంపై గర్వపడుతున్నామని చెప్పారు.
ఇతర దేశాలకు 5జీ టెక్నాలజీ అందించేందుకు సిద్ధం-నిర్మలా సీతారామన్
Advertisement
తాజా వార్తలు
Advertisement