కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్ సమీక్షని నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో సహా పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు, మౌలిక వసతులపై సమీక్షలో చర్చించారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి రాష్ట్రం ఖర్చు పెట్టిన నిధులివ్వాలని బుగ్గన కోరారు. ‘ఉడాన్’ కింద రూ.176 కోట్లు రియంబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరంలో జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం ప్రారంభమయ్యాక విశాఖ విమానాశ్రయం మూసేయాలన్నారు. విశాఖలో 30 ఏళ్ల పాటు పౌరవిమానాలు మూసేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బుగ్గన కోరారు. వివిధ ప్రాజెక్టులకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కార్పస్ ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలో రూ.20వేల కోట్లతో వీజీఎఫ్ ఏర్పాటు చేస్తే ఉపయోగకరమని ఏపీ అభిప్రాయం వ్యక్తం చేసింది. కడప స్టీల్ ప్లాంట్‌కు 20 ఏళ్ల సుంకాలు, సీజీఎస్టీ, ఆదాయపన్ను, దిగుమతి సుంకాలు రియంబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే ఏపీ పరిశ్రమలకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. కేంద్రానికి ఇచ్చిన భూముల్లో ప్లాంట్లు రాకుంటే వాటిని తిరిగి రాష్ట్రానికి ఇవ్వాలని బుగ్గన కోరారు. మరి మంత్రి డిమాండ్లకి కేంద్రం ఏమంటుందో చూడాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement