కేరళలో నిఫా వైరస్ మళ్లీ వెలుగుచూసింది. కొజికోడ్‌లో 12 ఏళ్ల బాలుడు నిఫా వైరస్‌తో మృతి చెందాడు. దీంతో కేరళలోని ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, బాలుడి కుటుంబ సభ్యుల్లో ఎవరికీ వైరస్ వ్యాపించలేదని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
కాగా గతంలో 2018లో కేరళను నిఫా వైరస్ గడగడలాడించింది. ఆ ఏడాది నిఫా వైరస్ సోకి దాదాపు 17 మంది చనిపోయారు. దీంతో కేరళకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం మరోసారి కేరళలో నిఫా వైరస్ కలకలం రేగడంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కేరళలోనే ఎక్కువగా నమోదవుతున్న సంగతి తెలిసిందే.