చైనాలో రోజుకి తొమ్మిది వేల మంది కరోనాతో మరణిస్తున్నారని బ్రిటన్ కి చెందిన ఎయిర్ఫినిటీ అనే పరిశోధనాసంస్థ అధ్యయనాలు తెలిపాయి. కరోనా ఆంక్షలు ఎత్తివేయకముందు నుంచి కొన్ని ప్రావిన్స్‌లలో కరోనా తీవ్రతను రికార్డు చేస్తున్నట్లు వెల్లడించింది.
గత డిసెంబర్ నేలలో కోటీ 86 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపింది. వారిలో సుమారు లక్ష మంది మరణించి ఉంటారని పేర్కొన్నది. జనవరి మధ్య నాటికి రోజుకు 37 లక్షల కేసులు నమోదవుతాయని హెచ్చరించింది. నెలాఖరుకు వైరస్ 5 లక్షల 84 వేల మంది చనిపోయే అవకాశం ఉందని పేర్కొన్నది. కాగా, డిసెంబర్ 30న దేశంలో ఒక్కరు మాత్రమే మరణించారని ప్రభుత్వం ప్రకటించడం విశేషం.
- Advertisement -