Thursday, November 21, 2024

తొమ్మిది లక్షల 46 వేల నకిలీ కాయిన్స్.. పోలీసుల అదుపులో నిందితుడు

న‌కిలీ కాయిన్స్ త‌యారు చేస్తున్న ముఠాని ప‌ట్టుకున్నారు పోలీసులు.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా తొమ్మిది లక్షల నకిలీ కాయిన్స్‌ను పోలీసు అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీ , ముంబయి పోలీసులు సంయుక్తంగా ఈ మొత్తాన్ని ముంబయిలో సీజ్ చేశారు. ‘ఢిల్లీ పోలీసు స్పెషల్ టీమ్ ముంబయికి వచ్చింది. ఫేక్ కాయిన్ బిజినెస్‌ గురించి త‌మ‌కి తెలిపార‌ని .. వెంటనే మలడ్‌లోని వల్లభ్ బిల్డింగ్ ఏ- వింగ్ సొసైటీలో జాయింట్ ఆపరేషన్ చేశామ‌న్నారు. దాంతో పెద్ద మొత్తంలో కాయిన్స్ సీజ్ చేశాం’ అని దిందోషి పోలీసు స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి జీవన్ కరత్ తెలిపారు. జిగ్నేశ్ గాలా అనే 42 ఏళ్ల నిందితుడిని దిందోషి పోలీసు స్టేషన్ పరిధిలో పుష్పక్ పార్క్ ఏరియాలో పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించినట్టు వివరించారు. సుమారు 9 లక్షల 46 వేల నకిలీ కాయిన్స్ సీజ్ చేశాం. ఇందులో ఒక రూపాయి, ఐదు రూపాయాలు, పది రూపాయల కాపర్, బ్రాస్ కాయిన్స్ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement