Tuesday, November 19, 2024

నిండుకుండ‌లా మూసీ.. ప్రాజెక్టు కేట్లు ఎత్తివేత‌

తెలంగాణ‌కు మూడు రోజుల పాటు వ‌ర్ష సూచన ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప‌లు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇప్ప‌టికే చెరువులు, కుంట‌లు నిండుకుండ‌లా మారాయి. అంతేకాకుండా ప్రాజెక్టుల్లో సైతం భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టులు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుంటున్నాయి. నల్లగొండ జిల్లాలోని అతి పెద్ద మధ్యతరహా ప్రాజెక్టు మూసీ (Musi project) నిండుకుండలా మారి కనువిందు చేస్తుంది. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలతో గత కొద్ది రోజులుగా మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికు చేరువైంది. దీంతో గత రెండు రోజులుగా దిగువ ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తూ వచ్చారు. సోమవారం ఉదయం 6 గంటలకు అధికారులు ప్రాజెక్టు 3, 7, 10వ నంబర్ గేట్లను ఎత్తివేశారు.

ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1242.79 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1999.74క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644.61 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు. ఇప్పుడు 4.36 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. మూసీ ప్రాజెక్టు గేట్లు ఎతడంతో ప్రజలు చూడడానికి తరలివస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement