ఏపీ హైకోర్టులో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన పిటిషన్ దాఖలు చేశారు. తాను గవర్నర్‌తో జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ బయటకు లీకవుతుండటంపై విచారణ జరపాలని నిమ్మగడ్డ కోరారు. ఈ అంశంలో తనకు అనేక అనుమానాలున్నాయని, మొత్తం వ్యవహారం బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని నిమ్మగడ్డ తన పిటిషన్ లో కోరారు. తాను గవర్నర్‌కు రాస్తున్న ప్రివిలేజ్ లెటర్స్ అన్నీ ఆఫీస్ నుంచి ఎలా బయటకు వస్తున్నాయో తేల్చాలని నిమ్మగడ్డ కకోరారు.
చివరకు తాను సెలవు పెడుతున్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయన్న నిమ్మగడ్డ, తాను గవర్నర్‌కు రాసిన లేఖల్ని సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెబుతున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు. అదేలా సాధ్యమో విచారణ జరపాలని కోరారు. అంశంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎస్‌తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.