Saturday, November 23, 2024

ఏపీలో ఈనెల 14తో ముగియనున్న నైట్ కర్ఫ్యూ

కరోనా కేసుల నేపథ్యంలో ఏపీలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. అన్ని జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉ.6 గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే ఈనెల 14వ తేదీతో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ గడువు ముగియనుండటంతో సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

ఏపీలో ప్రస్తుతం కొన్ని జిల్లాలలో రోజుకు 50-100 లోపు కేసులు నమోదవుతుండగా..ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే సగటున 300 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలు కొనసాగించి.. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పూర్తిస్థాయిలో ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి. ఒకట్రెండు రోజుల్లో కర్ఫ్యూ ఎత్తివేతపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్థానిక టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలు మధ్యాహ్నం నుంచే ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: జగన్ పాలనపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది: నాదెండ్ల మనోహర్

Advertisement

తాజా వార్తలు

Advertisement