Friday, November 22, 2024

తెలంగాణలో నేటితో ముగియనున్న కర్ఫ్యూ.. వాట్ నెక్ట్స్ ?

తెలంగాణలో కరోనా కల్లోకం సృష్టిస్తోంది. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు విధించిన నైట్ కర్ఫ్యూను ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులపాటు కర్ఫ్యూను పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 20న విధించిన నైట్‌ కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించాలని భావిస్తోంది. కర్ఫ్యూ పొడిగింపుపై ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణలో మరో రెండు మూడు రోజుల్లో లాక్‌ డౌన్ విధించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని ప్రభుత్వం కొట్టివేసింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అవకాశం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ కోలుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ఆక్సిజన్, ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత తదితర అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హోమంత్రి మహమూద్ ఆలీ ఉన్నతధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుసుకున్నారు. అన్నింటిని పరీశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ కర్ఫ్యూను పోడగించేందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్య లాక్ డౌన్ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. ఓ వైపు కట్టడి చేస్తూ..మరోవైపు వ్యాక్సిన్ ప్రక్రియ ద్వారనే కరోనాను కట్టడి చేయాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది.

ఇదిలా ఉంటే.. కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన హైకోర్టు సైతం కర్ఫ్యూను కొనసాగిస్తారా ? లేదా ? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వ చర్యలతో పాటు ఎన్నిక నిర్వహణపై కూడ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు సంబంధించిన అంశాలను ఒక్కరోజు ముందుగా తెలపడంలో అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూను పోడిగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement