ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల పలు రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. రాత్రి పది గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు ఈ నైట్ కర్ఫ్యూని విధించారు. నైట్ కర్ఫ్యూ సమయంలో ప్రజలు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలందరూ మాస్కులు ధరించి బయటకు రావాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఎఫెక్ట్ మన ఇండియా పై బాగానే పడుతుంది. ఈ కరోనా కొత్త వేరియంట్ కారణంగా తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా కర్ణాటక రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం కర్ణాటక రాష్ట్రంలో ఈనెల 28 వ తేదీ నుంచి.. నైట్ కర్ఫ్యూ అమలు కానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..