Saturday, November 23, 2024

పంజాబ్ లో నైట్ క‌ర్ఫ్యూ – స్కూల్స్ మూసివేత

క‌రోనాకి తోడు ఒమిక్రాన్ కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి ప్ర‌పంచంలోని అన్ని దేశాల్లో. దాంతో భార‌త్ లోని ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేశాయి. తాజా మార్గదర్శకాలు ఈ నెల 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. ప‌లు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే స్కూల్స్ ని మూసివేశారు. కాగా పంజాబ్ లో కూడా ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ‌వుతుండ‌టంతో పాఠ‌శాల‌లు, కాలేజీలు మూసివేయాల‌ని ఆదేశించింది. క్రీడా ప్రాంగ‌ణాలు, స్విమ్మింగ్ పూల్స్ , జిమ్ ల‌ను కూడా పూర్తిగా మూసివేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేర‌కు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలకు కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. కాగా, విద్యాసంస్థలు ఆన్ లైన్ బోధన కొనసాగించుకోవచ్చని చెప్పింది. వైద్య, నర్సింగ్ కళాశాలలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు, రెస్టారెంట్లు, బార్లు, షాపింగ్ మాల్స్, స్పాలు, జంతుప్రదర్శనశాలలు, మ్యూజియంలను 50 శాతం సామర్థ్యంతో నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న సిబ్బందినే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులు నిర్వర్తించేందుకు అనుమతించాలని తాజా మార్గదర్శకాల్లో వివరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement