Saturday, November 23, 2024

మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో  కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో నిత్యం నమోదవుతున్న కరోనా కేసుల్లో 60 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే బయట పడుతున్నాయి. దీనికి తోడు కొత్త మ్యుటేషన్ల వ్యాప్తికి సంబంధించిన ఆందోళన నెలకొంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  

ఆదివారం నుంచి అక్కడ రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నారు. మాల్స్‌ని రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశించారు. ఆదివారం నుంచి రోజూ రాత్రి 8 గంటలకు మూసివేయాలని, షాపింగ్ మాల్స్ ఉదయం 7 గంటల తర్వాతే తెరవాలని ప్రభుత్వం సూచించింది. రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే… ఇంతకు మించిన మార్గం కనిపించట్లేదని ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు ప్రజలు కరోనా నిబంధనలకు పాటించకపోతే… వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ఉద్ధవ్ థాక్రే హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నపళంగా లాక్‌డౌన్ తెచ్చే ఉద్దేశం లేదని తెలిపారు. ఎక్కడెక్కడ లాక్‌డౌన్ తేవాలో జిల్లాల కలెక్టర్లు, అధికారులు నిర్ణయిస్తారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement