తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న వేళ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ రోజు నుంచి ఈనెల 30 వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి బయట తిరగడం నిషేధం అని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుందని వివరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లను మూసి వేయాలని చెప్పింది.
అటు ఇప్పటికే సీఎం కేసీఆర్ కరోనా బారిన పడటంతో పాటు తెలంగాణలో రోజూ 4వేలకు పైగా కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత ఏడాది తక్కువ కేసులు ఉన్నప్పుడే తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లో ఉందని, ఇప్పుడు కేసులు విపరీతంగా పెరగడంతో లాక్‌డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ విధించాలని హైకోర్టు సోమవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.