Friday, November 22, 2024

BreakingL ఢిల్లీలో మంకీపాక్స్​ కలకలం.. నైజిరీయన్​కు పాజిటివ్​, హాస్పిటల్​లో చికిత్స

ఢిల్లీలో మంకీపాక్స్​ కలకలం చెలరేగింది. నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్​ పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. 35 ఏళ్ల నైజీరియన్ వ్యక్తి ఢిల్లీలో నివసిస్తున్నాడు. కాగా, ఇతను ఈ మధ్య ఎటువంటి జర్నీ చేయలేదు. విదేశీ ప్రయాణాలు కూడా లేవు. కానీ, మంకీపాక్స్ సోకడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసుతో దేశంలో మంకీపాక్స్​ సోకిన వారి సంఖ్య ఆరుకు చేరుకుందని అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి.

కాగా, ఢిల్లీలో మంకీపాక్స్​ పాజిటివ్‌ వచ్చిన రెండో వ్యక్తిగా ఇతడు ఉన్నాడు. అతనికి విదేశీ లేదా స్థానిక ప్రయాణాలకు సంబంధించిన ఇటీవలి చరిత్ర లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. నైజీరియన్ వ్యక్తికి ఇన్ఫెక్షన్ చికిత్స కోసం నోడల్ ఆసుపత్రి అయిన ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని LNJP హాస్పిటల్‌లో చేరాడు. అతనికి గత ఐదు రోజులుగా బొబ్బలు, జ్వరం ఉన్నాయి. అతని బ్లడ్​ శాంపుల్స్​ని పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపారు. అయితే.. ఆఫ్రికన్ మూలానికి చెందిన ఇద్దరు మంకీపాక్స్ అనుమానిత రోగులు కూడా LNJP ఆసుపత్రిలో చేరినట్టు అనధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement