Tuesday, November 26, 2024

నైజీరియాలో మార‌ణ‌హోమం – 200మందిని బ‌లిగొన్న బందిపోట్లు

బందిపోట్ల దాడిలో వారం రోజుల్లో 200మందికి పైగా ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయార‌ని అంత‌ర్జాతీయ మీడియా వెల్ల‌డించింది. నైజీరియాలో ముష్క‌రులు మార‌ణ‌హోమాన్ని సృష్టించారు. బందిపోట్ల దాడుల్లో హ‌త్య‌కు గురైన 154మందిని తాము పాతిపెట్టిన‌ట్లు జంఫారా రాష్ట్రంలోని బాధిత గ్రామానికి చెందిన ఒక సంఘం నాయ‌కుడు బ‌ల‌రాబే అల్హాజీ వెల్ల‌డించారు. కాగా ఈ వారంలో బందిపోట్ల ర‌హ‌స్య స్థావ‌రాల‌పై సైనిక వైమానిక దాడులు జ‌రిగాయి. ఈ దాడుల అనంత‌రం సాయుధ బందిపోటు దారులు ప్ర‌తీకార దాడుల‌కు దిగారు. బందిపోటు దారులు, Nigeria సైనిక వైమానిక దాడుల నేప‌థ్యంలో చోటుచేసుకున్న ఘోరమైన ప్రతీకార దాడుల్లో దాదాపు 200 మందికి పైగా జ‌నం మంది చ‌నిపోయార‌ని స్థానికులు వెల్ల‌డించారు.

బుధవారం నుండి గురువారం వరకు అంకా, బుక్కుయుమ్ జిల్లాల్లోని పది గ్రామాల్లో మోటారు బైక్‌లపై వచ్చిన వందలాది ముష్కరులు విధ్వంసానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. నివాసితులను కాల్చివేసి, దోపిడికి పాల్పడ్డారని, ఇళ్లను తగులబెట్టారు. పది గ్రామాల పరిధిలో మరణించిన వారి మృతదేహాలను సేకరిస్తున్నామని, మృతుల సంఖ్య ఇంకా తేలలేదని స్థానికులు వెల్ల‌డించారు. ముష్క‌రుల దాడుల్లో చనిపోయిన వారికి సామూహిక ఖననాలను నిర్వహించడానికి సైన్యం కమ్యూనిటీలను స్వాధీనం చేసుకుంది. అయితే, బందిపోటు దాడుల్లో 58 మంది మృతి చెందినట్లు అక్క‌డి స‌ర్కారు ప్ర‌క‌టించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement