రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 969 పాయింట్లు కోల్పోయి 56,713 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ 274 పాయింట్లు కుప్పకూలి 16,932 వద్ద ట్రేడవుతోంది. ఉక్రెయిన్ విషయంలో ఇటు రష్యా, అటూ అమెరికా వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం తప్పదనే పరిస్థితి నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement