Thursday, November 21, 2024

Terror Case: హైదరాబాద్​లో పేలుళ్లకు ఉగ్ర కుట్ర.. కేసును టేకప్​ చేసుకోనున్న ఎన్​ఐఏ

హైదరాబాద్​ పోలీసులు క్రాక్​ చేసిన ఓ ఉగ్రకుట్రకు సంబంధించిన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) పరిశీలనలోకి వెళ్లనుంది. పాకిస్తాన్​ ఐఎస్​, ఉగ్రవాద సంస్థ ప్లాన్​ చేసిన ఉగ్రదాడి కుట్రను ఈ మధ్యనే హైదరాబాద్​ పోలీసులు భగ్నం చేశారు. దీనికి సంబంధించిన నిందుతులను కూడా అరెస్టు చేశారు.  హైదరాబాద్‌ పోలీసులు గత వారం హుమాయూన్‌నగర్‌లోని రాయల్‌ కాలనీకి చెందిన అబ్దుల్‌ జాహెద్‌ (40), మాజ్‌ హసన్‌ ఫరూక్‌ అలియాస్‌ మాజ్‌ (29), మలక్‌పేటకు చెందిన మహ్మద్‌ సమీయుద్దీన్‌ అలియాస్‌ మహ్మద్‌ సమీ (39)ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.ఇప్పుడు పాకిస్థాన్‌లో తలదాచుకున్న హైదరాబాద్ ఉగ్రవాద నిందితులు ముగ్గురు – ఫర్హతుల్లా గౌరీ, సిద్దిక్ బిన్ ఉస్మాన్ అలియాస్ రఫీక్ అలియాస్ అబు హంజాలా, అబ్దుల్ మజీద్ అలియాస్ చోటూ – కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. చాలా కాలాంగా వీరు భద్రతా సంస్థల రాడార్‌ నిఘాలో ఉన్నారు.

గత వారం అక్టోబర్ 2న హైదరాబాద్ పోలీసులు జాహెద్, సమీ, మాజ్‌లను అరెస్టు చేసి వీరి నుంచి నాలుగు నాటు బాంబులు, 5.41 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌ఐఏ కోరిందని, అదే విషయాన్ని హైదరాబాద్ పోలీసులు వారితో షేర్​ చేసుకున్నట్టు హైదరాబాద్ పోలీసు వర్గాలు తెలిపాయి.

జాహెద్ ఫర్హతుల్లా ఘౌరీతో చాట్ చేయడానికి సామి వారి మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అతని కమ్యూనికేషన్ తర్వాత కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సామీకి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్‌లను అందజేశారు. అతను వాటిని మలక్‌పేటలో జాహెద్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత ఓ హోటల్‌లో జాహెద్‌ అబ్దుల్‌ సమీ, మాజ్‌లకు ఒక్కో గ్రెనేడ్‌ ఇచ్చి రెండు గ్రెనేడ్‌లను తన వద్ద ఉంచుకున్నాడని పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు హ్యాండ్ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలను సప్లయ్​ చేస్తున్న ఈ నలుగురిని మేలో హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. కరాటే టీచర్ అబ్దుల్ ఖాదర్ తదితరులపై నిజామాబాద్ పోలీసులు నమోదు చేసిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసును ఇటీవల ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఈ కేసును కూడా ఎన్​ఐఏ తమ పరిధిలోకి తీసుకోవాలని భావిస్తోంది. దీంతో తెలంగాణలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement