Friday, November 22, 2024

పెప్సీ, కోకాకోలాకు ఎన్​జీటీ 25 కోట్ల భారీ ఫైన్​.. నీటి అక్రమ వాడకంపై చర్యలు..

భూగర్భ జలాలను అక్రమంగా వెలికితీసినందుకు పెప్సి, కోకాకోలా కంపెనీపై గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) భారీగా ఫైన్ వేసింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని తమ తయారీ ప్లాంట్లలో భూమి నుండి భూగర్భ జలాలను అక్రమంగా వెలికితీసినందుకు రూ. 25 కోట్ల జరిమానా విధించింది. మూన్ బెవరేజెస్ (కోకా-కోలా), వరుణ్ బెవరేజెస్ (పెప్సికో) భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి వారి అవసరాలను తీర్చడంలో విఫలమవడం ద్వారా వారి లైసెన్స్ ల నిబంధనలను ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చాయి. అలాగే NOC గడువు ముగిసిన తర్వాత భూగర్భ జలాల వెలికితీత కొనసాగిందని విచారణలో తేలింది.

ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్, సుధీర్ అగర్వాల్, బ్రజేష్ సేథీ జ్యుడీషియల్ సభ్యులుగా..  ప్రొఫెసర్ ఏ సెంథిల్ వెల్, డాక్టర్ అఫ్రోజ్ అహ్మద్ అదనపు నిపుణులుగా ఉన్న ప్యానెల్ గ్రేటర్ నోయిడా ప్లాంట్‌పై రూ.1.85 కోట్లు, సాహిబాబాద్‌పై రూ.13.24 మిలియన్ల జరిమానా విధించింది. కోకాకోలా ప్లాంట్, పెప్సీ గ్రేటర్ నోయిడా ప్లాంట్‌పై రూ. 9.71 కోట్ల ఫైన్​ వేసింది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ ట్రిబ్యునల్‌, ఉత్తరప్రదేశ్‌ భూగర్భ జల శాఖ, జిల్లా అధికారులను నిపుణుల బృందంతో సందర్శించి భూగర్భ జలాలను రీఛార్జ్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్‌జీటీ కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement