Tuesday, November 26, 2024

రాక్ గార్డెన్ లో కోట్ల ఏళ్ల క్రితం ఏర్ప‌డిన శిల‌లు

ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ర‌కాల గార్డెన్స్ ని చూసి ఉంటారు. మ‌రి మీకు రాక్ అంటే రాళ్లు గార్డెన్ గురించి తెలుసా. అయితే అరుదైన శిల‌ల‌ని చూడాలంటే హైద‌రాబాద్ లోని హ‌బ్సిగూడ‌లో ఉన్న ఎన్జీఆర్ ఐ కి వెళ్తే స‌రి. దేశంలోని ప‌లు ప్రాంతాల నుంచి సేక‌రించిన రాళ్లతో ఇక్క‌డ గార్డెన్ ని ఏర్పాటు చేశారు. అదే రాక్ గార్డెన్. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో భూమిలో దొరికే విలువైన‌, అరుదైన శిల‌లని మ‌నం చూడొచ్చు. విద్యార్థులకు ఈ రాక్ గార్డెన్ ఎంతో ఉపయోగకరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రజలు ఎవరైనా అన్ని పనిదినాల్లో సందర్శించేందకు అనుమతించనున్నారు.

మొత్తం 45 రకాల శిలలను ఏర్పాటు చేశారు. 330 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినవిగా భావిస్తున్న డాసైట్ రాక్ శిల కూడా ఇక్కడ కనిపిస్తుంది. 55 మిలియన్ సంవత్సరాల చరిత్ర కలిగిన శిలలను కూడా ఉంచారు. అనతపురం జిల్లాలో కనిపించే డోలమైట్, ఖమ్మం జిల్లాలో కనిపించే పెట్రిపైడ్ వుడ్ రాయి, లైమ్ స్టోన్, హనీ ఎల్లో, కింబర్ లైట్ ఇలా చాలా రకాలే ఉన్నాయి. ఈ రాక్ గార్డెన్ ను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ ప్రారంభించారు. భూమికి 175 కిలోమీటర్ల లోతు నుంచి సేకరించిన శిల కూడా ఇక్కడ కొలువుదీరింది. ప్రతీ శిల పక్కన దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం, చారిత్రక ప్రాధాన్యం తెలుసుకునే ఏర్పాటు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement