యునైటెడ్ స్టేట్స్ లో పెరుగుతోన్న ద్రవ్యోల్బణం గురించి ఫాక్స న్యూస్ కరస్పాండెంట్ పీటర్ డూసీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎగతాళి చేయడం వివాదాస్పదంగా మారింది. అది గొప్ప ఆస్తి అని, మరింత ద్రవ్యోల్బణం అని చెబుతూ ఎంత తెలివితక్కువ దద్దమ్మవి stupid son of a bitch అని బైడెన్ సమాధానం చెప్పడం, అది కాస్తా రికార్డ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మాటలని బైడెన్ గట్టిగా అనకపోయినా హాట్ మైక్ తో ఇది అందరికీ వినిపించడంతో తన మైక్ ఇంకా ఆన్ లో ఉందని అధ్యక్షుడికి తెలిసే అన్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది.
అయితే బైడెన్ ను రిపోర్టర్ ప్రశ్నించడం.. ఆయన సమాధానం ఇవ్వడం కూడా కెమెరాకు చిక్కింది. ద్రవ్యోల్బణం రాజకీయ బాధ్యత అని మీరు భావిస్తున్నారా’’ అని డూసీ అడిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర సందర్భాల్లోనూ, బైడెన్ తనకు నచ్చని విషయాల మీద ప్రశ్నిస్తే రిపోర్టర్లను దూషించాడని న్యూయార్క్ పోస్ట్ వార్తాపత్రిక నివేదించింది. గత వారం, అమెరికా అధ్యక్షుడు ఒక మహిళా ఫాక్స్ న్యూస్ రిపోర్టర్‌పై కూడా ఇలాగే దాడి చేశాడు “సర్, (రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్) పుతిన్ కోసం మీరు ఎందుకు వేచి ఉన్నారు అని అడగగా.. దానికి బిడెన్, “ఏమిటి తెలివితక్కువ ప్రశ్న” అని బదులిచ్చారు. ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు నోరు జారడం సర్వ సాధారణంగా మారింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..