Friday, November 22, 2024

న్యూజిలాండ్‌ పేస్‌ కు కోహ్లీ సేన దాసోహం..

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ తడబడింది. న్యూజిలాండ్‌ సీమర్‌ కైల్‌ జేమీసన్‌ (5/31) నిప్పులు చెరగడంతో భారత్‌ బదులివ్వలేకపోయింది. ఆదివారం తొలి సెషన్‌లోనే భారత్‌ పతనం అంచున నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరుకే కెప్టెన్‌ కోహ్లి పెవిలియన్‌ చేరాడు. జేమీసన్‌ చక్కని లెంత్‌ బాల్‌తో భారత కెప్టెన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ పంత్‌ను జేమీసనే ఔట్‌ చేశాడు. దీంతో 156 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కూలింది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై రహానే ఆట కూడా ఎంతోసేపు సాగలేదు. వాగ్నర్‌ బౌలింగ్‌లో రహానే స్క్వేర్‌ లెగ్‌లో లాథమ్‌ చేతికి చిక్కాడు. రెండో సెషన్‌ మొదలైన కాసేపటికే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద ముగిసింది. రహానే (190 బంతుల్లో 49; 5 ఫోర్లు), కోహ్లి (196 బంతుల్లో 44; 1 ఫోర్‌) రాణించారు. బౌల్ట్, వాగ్నర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

ఇక అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌ జట్టుకు తొలి ఇన్నింగ్స్ లో శుభారంభం లభించింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (30), డెవాన్ కాన్వే (38) తొలి వికెట్ కు 70 పరుగులు జోడించారు. ఈ జోడీని చివరికి అశ్విన్ విడదీశాడు. లాథమ్ ను అశ్విన్ అవుట్ చేయడంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. పిచ్‌ పరిస్థితిని గుర్తించిన కివీస్‌ ఓపెనర్లు లాథమ్, కాన్వే జాగ్రత్తగా ఆడి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు వందేసి బంతుల్ని ఎదుర్కొన్నారు. లాథమ్‌ (104 బంతుల్లో 30; 3 ఫోర్లు)ను ఎట్టకేలకు అశ్విన్‌ పడేయడం కోహ్లి సేనకు కాస్త ఊరట నిచ్చింది. మరోవైపు ఓపెనర్‌ కాన్వే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా… జట్టు స్కోరు వంద దాటింది. మరికాసేపటికే ఇషాంత్‌… కాన్వేను ఔట్‌ చేయడంతో 101 పరుగుల వద్ద కివీస్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement