Monday, November 25, 2024

డెలివ‌రీ కోసం ఆసుప‌త్రికి సైకిల్ పై వెళ్ళిన ఎంపీ.. త‌ర్వాత ఏం జ‌రిగిందంటే ..

గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌ర‌నుంచి డెలివ‌రీ అయ్యే వ‌ర‌కూ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు మ‌హిళ‌లు.. కొంద‌రైతే అన్నీ బెడ్ పైకే.. గ‌ర్భిణీలు అస‌లు క‌ద‌ల‌కూడ‌ద‌ని, క‌ష్ట‌మైన ప‌నులు చేయ‌కూడ‌ద‌ని చెబుతుంటారు పెద్దలు. కానీ ఇప్పుడు కాలం మారింది.. నిండు గ‌ర్భిణీలు కూడా యోగాలు చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. వాట‌ర్ అడుగున ఫొటో షూట్ లు చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. కాగా నిండు గ‌ర్భిణీ ఏకంగా సైకిల్ తొక్క‌డ‌మంటే మాట‌లా చెప్పండి.. కానీ అదే జ‌రిగింది. అది కూడా ఆమె సామాన్య మ‌హిళ కాదండోయ్.. ఆవిడ‌గారు ఒక ఎంపీ కూడా.. మ‌రి సౌక‌ర్యాల‌కి క‌రువా చెప్పండి..

ఆమె న్యూజిలాండ్ ఎంపీ జూలి ఆన్ జెంటర్ .. ఆమెకి ఉన్న‌ట్టుండి పురిటి నొప్పులు వ‌చ్చాయి. దాంతో ఆమె వెంట‌నే త‌న సైకిల్ పై ఆసుప‌త్రికి చేరుకోవ‌డం విశేషం. కాగా ఆమె హాస్ప‌టల్ కి చేరుకున్న గంట తర్వాత ఓ బేబీకి జన్మనిచ్చారు. గతంలోనూ ఆమె తన తొలి కాన్పులోనూ ఇలాగే సైకిల్‌పై హాస్పిటల్‌కు చేరుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే, ఈ సారి సైకిల్‌పై వెళ్లాలనే ప్రణాళికలేవీ చేసుకోలేదని, చివరి నిమిషంలో అలా వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. ప్రసవం అనంతరం ఆమె ఫేస్‌బుక్‌లో తన గుడ్ న్యూస్ పోస్టు చేశారు. ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో తమ కుటుంబంలో కొత్త సభ్యుడు వచ్చారని ఆమె పేర్కొన్నారు. హాస్పిటల్ వెళ్లడానికి తాను నిజానికి ప్లాన్ ఏమీ చేయలేదన్నారు. అయితే, చివరి నిమిషంలో సైకిల్‌పై వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. హాస్పిటల్ కోసం ఇంటి నుంచి రాత్రి రెండు గంటల ప్రాంతంలో బయల్దేరినప్పుడు పురిటి నొప్పులు మరీ అంత తీవ్రంగా లేవ‌న్నారు. ప్రసవం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగిందని బేబీ, తాను క్షేమంగా ఉన్నామ‌ని పోస్ట్ చేశారు . అంతేకాదు, ఆ బేబీని ఎత్తుకుని నిద్రపోతున్న తన భర్త ఫొటోనూ జత చేశారు. ఇప్పుడు వారిద్దరూ నిద్రిస్తున్నారని తెలిపారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. చాలా మంది ఆమె సైకిల్‌పై హాస్పిటల్‌‌కు వెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంతోషంగానూ ఫీల్ అయ్యారు. ప్రసవం కోసం సైకిల్‌పై వెళ్లడాన్ని కొందరు సమర్థించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital
Advertisement

తాజా వార్తలు

Advertisement