న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన టీమిండియా ఇవ్వాల (ఆదివారం) రెండో మ్యాచ్ ఆడుతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోతున్నారు. ఎలాగైనా ఈ మ్యాచ్‌ని గెలవాలని కసిగా ఆడుతున్నారు. పకడ్బందీ బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్లను కట్టుదిట్టం చేస్తున్నారు. దీంతో వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేయడంలో న్యూజిలాండ్ జట్టు తడబాటుకు గురవుతోంది. ఫలితంగా 18 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయింది ఆ జట్టు.
ఇక.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను ఫస్ట్ ఓవర్ నుంచే టీమిండియా కట్టుదిట్టం చేస్తోంది. దీంతో కివీస్ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. 3.3 ఓవర్ల వద్ద తొలివికెట్ ఫిన్ అలెన్ ( 11) ను కోల్పోయిన కివీస్.. ఆ వెంటనే కాన్వే (11) వికెట్‌ను కూడా పోగొట్టుకుంది. తర్వాత గ్లెన్ ఫిలిప్స్ (5), డారిల్ మిచెల్ (8), మార్క్ చాప్మన్ (14), మైఖెల్ బ్రేస్‌వెల్ (14), సోది (1), ఫెర్గూసన్ (0) భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలబడలేకపోయారు. చివరగా శాంట్నర్ 20, డఫీ 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
ఫలితంగా 18 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 8 వికెట్లు కోల్పోయింది. ఇక.. నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా టార్గెట్ 100 గా ఉంది.. ఈ క్రమంలో భారత బౌలర్లు అర్షదీప్‌సింగ్ 2, హార్దిక్‌పాండ్యా, వాషింగ్టన్‌సుందర్, చాహల్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.