Monday, November 25, 2024

11 రాష్ట్రాలకు కొత్త వేరియంట్‌.. అవసరమైతే లాక్‌డౌన్‌ పెట్టాలన్న కేంద్రం..

న్యూఢిల్లి : భారత్‌లో ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగవంతమైంది. ప్రతీ రోజూ పదుల సంఖ్యలో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటికి 11 రాష్ట్రాలకు కొత్త వేరియంట్‌ పాకింది. మొత్తం 145 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఆదివారం మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కర్నాటకలో ఆరు, కేరళలో నాలుగు, గుజరాత్‌లో రెండు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరిక బ్రిటన్‌ నుంచి ఆదివారం గుజరాత్‌కు వచ్చిన ఓ 45 ఏళ్ల వ్యక్తితో పాటు బాలుడిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్టు వైద్య అధికారులు వివరించారు. వెంటనే ఇద్దరు బాధితులను అహ్మదాబాద్‌లోని ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.

ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని వివరించారు. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త మహమ్మారి పాకింది. మహారాష్ట్రలో అత్యధికంగా 48 కేసులు వెలుగులోకొచ్చాయి. ఢిల్లిలో 22, తెలంగాణలో 20, రాజస్థాన్‌లో 17, కర్నాటకలో 14, కేరళలో 11, గుజరాత్‌లో 9, ఆంధ్రప్రదేశ్‌, చండీగడ్‌, తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్రలో 48 మందిలో 28 మంది ఇప్పటికే కోలుకున్నారు. ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులో నెగిటివ్‌ రావడంతో వారిని ఇళ్లకు పంపించారు.

అత్యవసరం అయితే ప్రయాణం
ఒకే చోట గుమిగూడొద్దని మళ్లిd కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. విధిగా ప్రతీ ఒక్కరు మాస్క్‌ ధరించాలని ఆదేశించింది. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని తెలిపింది. పరిస్థితి చేయిదాటే పరిస్థితి ఉంటే తొలుత రాత్రిళ్లు కర్ఫ్యూ విధించాలని, అదుపులోకి రానిపక్షంలో లాక్‌డౌన్‌ విధించుకోవాలని సూచించింది. ఢిల్లిdలో ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రులు ఒమిక్రాన్‌ సెంటర్స్‌గా మారాయి. సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌, మ్యాక్స్‌ (సాకేత్‌), ఫోర్టిస్‌ (వసంత్‌ కుంజ్‌), బత్రా హాస్పిటల్‌ (తుగ్లకాబాద్‌)లు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌లోని ఒమిక్రాన్‌ బాధితుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే మాస్క్‌ తప్పనిసరి చేశాయి. మహారాష్ట్ర, ఢిల్లిd, తెలంగాణ, రాజస్థాన్‌పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోందని, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు రెట్టింపు అయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక వ్యాప్తి దశలో ఉన్‌ డెల్టా వేరియంట్‌తో పోలిస్తే.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. డిసెంబర్‌ 16 నాటికి ప్రపం వ్యాప్తంగా 89 దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు బయటపడినట్టు గుర్తించింది. ఈ వేరియంట్‌పై మరింత డేటా అందుబాటులోకి వచ్చింది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే.. ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువ. అయితే తీవ్రత ఎలా ఉందనే విషయంపై డబ్ల్యూహెచ్‌ఓ తెలియజేయలేదు. పరిమిత డేటా తమ వద్ద ఉన్నట్టు తెలిపింది. ఒమిక్రాన్‌ బారినపడిన వారిపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఏ వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పని చేస్తుందనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపింది. దక్షిణాఫ్రికా, బ్రిటన్‌లో రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ బారినపడిన దేశాల్లో 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు రెట్టింపు అయ్యాయి.

- Advertisement -

జర్మనీ, బ్రిటన్‌ కీలక నిర్ణయం
బ్రిటన్‌లో కేసులు పెరుగుతున్నందున.. ఆ ప్రభుత్వం కట్టడి చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందుకోసం క్రిస్మస్‌ తరువాత రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధించాలని భావిస్తున్నట్టు తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించేపనిలో ప్రభుత్వం ఉన్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. వృత్తి, ఉద్యోగ అవసరాలకు మినహా మిగిలిన సమావేశాలకు అనుమతి రద్దు చేసింది. బార్లు, రెస్టారెంట్ల పని వేళలు కుదించింది. బ్రిటన్‌లో ఒకే రోజు 93,045 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇదేఅత్యధికం. బ్రిటన్‌ను హై రిస్క్‌ దేశాల జాబితాలో జర్మనీ చేర్చింది. కేవలం జర్మన్‌లు, ఇక్కడ నివసించే విదేశీయులకు మాత్రమే బ్రిటన్‌ నుంచి ప్రవేశానికి అనుమతి ఇచ్చింది. వారు తప్పనిసరిగా నెగిటివ్‌ రిపోర్టు పొందాలి. వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా 2వారాలు క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement