తోడేళ్లు ఎలా ఉంటుందో అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్న తోడేలు చాలా వింతగా ఉంటుంది. దీని పేరు మేన్డ్ వూల్ఫ్. ఇవి తోడేల్లే కానీ.. చూడటానికి కొద్దిగా నక్క లాగా ఉంటాయి. ఈ రెండూ కలిసి ఒక జంతువులుగా కనిపించే వాటిని మేన్డ్ వూల్ఫ్ అంటారు. మేనేడ్ తోడేలు పొడవాటి ఎరుపు-గోధుమ బొచ్చు, చాలా పొడవైన నల్లటి కాళ్ళు , నక్క లాంటి తలతో ఉంటుంది. మేన్డ్ తోడేలు రాత్రిపూట, ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి, ఇది చిన్న జంతువులు, కీటకాలు , మొక్కల పదార్థాలను తింటూ ఉంటాయి. అలాంటి వింత తోడేలుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంటర్నెట్ యూజర్ రెగ్ సాడ్లర్ ట్విట్టర్‌లో ఈ వీడియోని షేర్ చేశారు.
ఆ వింత తోడులు..నడి వీధిలో రోడ్డు దాటుతూ కనిపించడం గమనార్హం. విచిత్రం ఏమిటంటే, ఈ జంతువు మొదటి చూపులో తోడేలుగా కనిపించి, దగ్గరగా చూస్తే, అది నక్కగా కనిపిస్తుంది. దీంతో… ఈ జంతువు గురించి ఎవరికైనా తెలుసా.. ఇది ఏ వర్గానికి చెందినది అంటూ అతను ట్విట్టర్ లో నెటిజన్లను ప్రశ్నించాడు. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుండి ఈ పోస్ట్‌కి రెండు మిలియన్ల వ్యూస్ రావడం గమానర్హం. అలాంటి జంతువును చూసి చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు ఆశ్చర్యపోయారు. కొందరు ఇది హైనా అని భావించారు, మరికొందరు వీడియో ఫేక్ అని పేర్కొన్నారు.ఈ వీడియోను ట్విట్టర్ పేజీ ఫాసినేటింగ్ ద్వారా రీపోస్ట్ చేయగా…అక్కడ వారు జంతువును ‘మానెడ్ తోడేలు’ అని పేర్కొన్నారు. బ్రిటానికా ప్రకారం, మధ్య దక్షిణ అమెరికాలోని మారుమూల మైదాన ప్రాంతాల్లో కనిపించే కుక్కల కుటుంబానికి చెందిన అరుదైన పెద్ద చెవుల తోడేలు అని వారు పేర్కొనడం గమనార్హం.