ఇద్దరూ దిగ్గజ ఆటగాళ్లే. వరల్డ్ ర్యాంకింగ్స్‌లోనూ టాపర్లే. అలాంటి ఆటగాళ్లు వింబుల్డన్ ఫైనల్ చేరితే ఎలావుంటుంది. కచ్చితంగా కొదమసింహాల కొట్లాడినట్లే ఉంటుంది. ఆదివారం అల్కరాజ్, జకోవిచ్ మధ్య జరిగిన ఫైనల్ పోరు అచ్చం ఇలాగే సాగింది. ఒకరిది దూకుడు.. ఇంకొకరిది అనుభవంతో కూడిన పోరాటం. ఆరంభ సెట్‌ను మినహాయిస్తే, ప్రతి సెట్లోనూ ఉత్కంఠే. చివరికి విజయం 20 ఏళ్ల యువ సంచలనం అల్కరాజ్ను వరించింది. వరుసగా ఐదోసారి విజేతగా నిలవాలన్న జకో స్వప్నం చెదిరింది. ఏడుసార్లు వింబుల్డన్ విజేతైన జకోను ఓడించి కెరీర్లో తొలి వింబుల్డన్ కిరీటంతో స్పానిష్ స్టార్ సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయాడు. అల్కరాజ్కు ఇది రెండవ గ్రాండ్‌స్లామ్ గెలుపు కావడం విశేషం.
-నా కల నిజమైంది. గెలవడం గొప్ప అని ముందే చెప్పాను. ఓడిపోయినా నా గురించి నేను గర్వపడేవాడిని. అన్ని స్లామ్ల లెజెండ్‌తో ఫైనల్ ఆడటం నిజంగా అద్భుతమే. ఇక్కడ ఆడటం నాకు గర్వకారణం. ఈ విజయం చిరస్మరణీయం. మాటలకు అందని అనుభూతి. ఈ రోజు దక్కిన విజయానికి నిజంగా గర్వపడుతున్నాను. నేను ఈ స్థాయిలో ఆడతానని ఊహించలేదు. క్వీన్స్ గెలిచాను. ఇప్పుడు ఇక్కడ కూడా గెలిచాను. నేర్చుకుంటాను. అల్క రాజ్
ఈరోజు నాకు మంచిది కాదు. ఇది కార్లోస్ రోజు. అతడికి ప్రశంసలు. నాణ్యమైన సర్వ్‌లు చేయాల్సి వచ్చినప్పుడు పెద్ద సర్వ్‌లతో ముందుకు వచ్చాడు. అభినందనలు. ఇలాంటి మ్యాచ్‌లు ఓడిపోవడం ఇష్టం కానేకాదు. కానీ, భావోద్వేగాలు సద్దుమణిగినప్పుడు నేను కృతజ్ఞతలతోఉండాలి. నేను ఓడిపోవాల్సిన కొన్ని క్లోజ్ ఫైనల్స్‌లో గెలిచాను కాబట్టి ఇక్కడ అదృష్టం వరించలేదని అనుకుంటా – జకోవిచ్
లండన్: వింబుల్డన్ చరిత్రలో మరో కొత్తకెరటం తళుక్కు మంది. 20 ఏళ్ల స్పానిష్ ధ్రువతార తొలిసారి విజేతగా ఆవిర్భవిం చాడు. ప్రపంచ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 2, సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌ను మట్టికరిపించాడు. దాదాపు ఐదు గంటలపాటు సాగిన తుదిపోరులో ఏడుసార్లు టైటిల్ గెలిచిన 36 ఏళ్ల సెర్బియన్ ప్లేయర్ జకోవిచ్‌ను 1-6, 7-6(6), 6-1, 3-6, 6-4 స్కోరుతో ఓడించాడు. ఫైనల్ చేరిన తొలిసారే విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్ వన్ రాంకులో ఉన్న ఇతడు ప్రతిష్టాత్మక పోరులో అద్భుత ఆటతీరును కనబరిచాడు. 34 నిముషాల్లో తొలిసెట్‌ను (1-6) చిత్తుగా ఓడిన ప్పటికీ, ఆ తర్వాత జూలు విదిల్చి విజృంభించా డు. తనకంటే సీనియర్, అనుభవజ్ఞుడు, 23 గ్రాండ్‌స్లామ్‌ల విజేత అయిన జకోకు ముచ్చెమ టలు పట్టించాడు. రెండవ సెట్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడినా, చివరకు టై బ్రేకు లో (7-6(6) స్పానిష్ స్టార్ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అదే జోరులో మూడవ సెట్‌నూ ఏకపక్షంగా 6-1 వశం చేసుకున్నాడు. దాదాపు ఓటమి అంచుల్లోకి వెళ్లిన జకో పడిలేచిన కెరటంలా నాల్గవ సెట్లో ఉవ్వెత్తున ఎగసి పడ్డాడు. 6-3తో సెట్ గెలిచి టైటిల్‌పై ఆశలు సజీవంగా ఉంచుకున్నాడు.
ఈ క్రమంలో నిర్ణాయక ఐదవ సెట్ మరింత ఉత్కంఠతను రేకెత్తించింది. ఒక్కో పాయింటూ, ఒక్కో గేమ్ కోసం ఇద్దరూ చెమటోడ్చారు. చివరి క్షణం వరకు జకోవిచ్ పోరాటపటిమతో ఆకట్టుకు న్నాడు. 2015 తర్వాత సెంట్రల్ కోర్టులో ఓటమి ఎరుగని జకోవిచ్ కీలకపోరులో వెనుకంజవేశాడు. 36 ఏళ్ల జకోనిచ్ 2017 నుంచి వింబుల్డన్‌లో తిరుగులేని విజేతగా ఉన్నాడు. 34 వరుస విజయాలతో జార్న్ బోర్గ్ (41), ఫెదరర్ (40) తర్వాత టోర్న మెంట్లో మూడవ అత్యుత్తమ ప్లేయర్. 2022 ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌తో క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రాండ్‌స్లామ్‌లో అజేయంగా కొనసాగుతున్నాడు. ఈ విజయపరం పరకు అల్కరాజ్ బ్రేక్ వేశాడు. 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో అగ్రస్థా నంలో ఉన్న మార్గరెట్‌ను సమం చేయాలని భావించిన జకో ఆశలు ఫలించలేదు.
2019లో జకోవిచ్ (1), నాదల్ (2) తర్వాత ఇద్దరు అగ్రశ్రేణి ర్యాంకర్లు వింబుల్డన్ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. అంతకు ముందు 2013, 2015లో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ విజయానికి ముందు అల్కరాజ్ క్వీన్స్‌క్లబ్ చాంపియన్‌షిప్‌లో తొలి గ్రాస్‌కోర్టు టైటిల్ గెలిచాడు. ఏటీపీ టూర్ లెవల్సింగిల్ టైటిళ్లూ నెగ్గాడు. ఇందులో 2022 యూఎస్ ఓపెన్‌తోపాటు నాలుగు మాస్టర్ 1000 ట్రోఫీలు కూడా ఉన్నాయి. రాఫెల్ నాదల్ (2008, 2010), మాన్యువల్ సంత్నాన (1966) తర్వాత వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్న మూడవ స్పెయిన్ ఆట గాడు అల్కరాజ్ చరిత్ర సృష్టిం చాడు. మొత్తం మీద యూ ఎస్ ఓపెన్ 2022 తర్వాత రెండవ గ్రాండ్‌స్లామ్ ఫై నల్కు చేరుకున్నాడు. నాదల్ 20 ఏళ్ల 36 రోజుల వయసులో విం బుల్డన్ నెగ్గగా, ఇప్పుడు అల్కరాజ్ 20 ఏళ్ల 72 రోజుల వయసులో టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండవ స్పెయిన్ ప్లేయర్‌గా నిలిచాడు.
టా..