Tuesday, November 26, 2024

New State Demand – మ‌ళ్లీ రాజుకుంటున్న ప్ర‌త్యేక మ‌రాఠ్వాడా….కెసిఆర్ మ‌ద్ద‌తుపై ప్ర‌జ‌ల అశ‌లు..

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : మహారాష్ట్రలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మరాఠ్వాడలో ప్రత్యేక రాష్ట్రం డిమా ండ్‌ మరోమారు రాజుకుంటోంది. తొలి విడత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం విఫలం కావడంతో మలివిడత ఉద్యమానికి స్థానిక నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పేదరికం, తక్కువ వర్షపాతం, కరవు, వలసలు, ఫ్లోరోసిస్‌ బాధలు, రైతుల ఆత్మహత్యలకు నిలయమైన మరాఠ్వాడా ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా మారితే తప్ప విముక్త్తి లేదని భావించిన స్థానిక నేతలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మరాఠ్వాడా ముక్తిమోర్చా పేర ప్రత్యేక ఉద్యమ సంస్థ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సారథ్యం వహించింది. గతంలో ఉవ్వెత్తున సాగిన మరాఠ్వాడ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ పలు కారణాల వల్ల పక్కకుపోయింది. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతం త్య్రం వచ్చిన తర్వాత బాషాప్రయుక్త రాష్ట్రాల విలీనం జరి గింది. తొలి ప్రధాన మంత్రి పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, నాటి హోంశాఖ మంత్రి సర్దార్‌ పటేల్‌ హైదరాబాద్‌స్టేట్‌పై సైనిక చర్య అనంతరం నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ లొంగిపోవడంతో హైదరాబాద్‌ రాష్ట్రం భారత్‌లో అంతర్బా గమైన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్బా గంగా ఉన్న ఔరంగాబాద్‌ రీజియన్‌ లోని ప్రాంతాలను మరాఠీ మాట్లాడే ప్రాంతాలుగా గుర్తించి బాషాప్రాతిపధికన 1948 లో మహారాష్ట్రలో విలీనం చేశారు. విలీనం తర్వాత మరాఠ్వాడా ప్రాంతం పాలకుల తీవ్ర నిర్లక్ష్యానికి గురి కావడం, అభివృద్ధికి ఆమడదూరంలో ఉండడంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతేనే తమకు విముక్తి కలుగుతుందని భావించి ఉద్యమాలు మొదలయ్యాయి. నాటి ఈ ఉద్యమానికి అప్పటి అడ్వకేట్‌ జనరల్‌గా ఉన్న శ్రీహరి అనీ తన పదవికి రాజీనామా చేసిన ఘటన కూడా ఉంది. ఔరంగాబాద్‌ రీజియన్‌ పరిధిలోని మరఠ్వాడా ప్రాంతంలో ఔరంగాబాద్‌, బీద్‌, హింగోలి, జాల్నా,లాథూర్‌, నాందేడ్‌, ఉస్మానాబాద్‌,పర్బానీ మొత్తం 8 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలు మహారాష్ట్రలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి.

తొలి విడత ఉద్యమం విఫలం కావడంతో మలివిడత ఉద్యమం మొదలుబెట్టేందుకు ఈ ప్రాంత నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. గతంలో మాదిరిగా కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై జరిగిన వ్యూహం, పోరాట పద్దతులను మార్గదర్శకంగా తీసుకుని మలివిడత ఉద్యమం చేపట్టేందుకు ఆ ప్రాంతానికి చెందిన నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక సారథి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తన పార్టీ బీఆర్‌ఎస్‌ను మహారాష్ట్రలో కూడా విస్తరించాలనే లక్ష్యంతో ఇప్పటికే మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సంస్థాగతంగా గ్రామస్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు విస్తృతంగా కార్యక్రమాలను చేపడుతున్నారు.

మరాఠ్వాడా ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేసీఆర్‌ సారథ్యంలో నెరవేరుతుందన్న ఆశతో ఉన్న ఆ ప్రాంత ప్రజలు, నాయకులు బీ ఆర్‌ఎస్‌ను విశేషంగా ఆదరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ పార్టీలో చేరితే తమ దీర్ఘకాల రాష్ట్ర డిమాండ్‌ లక్ష్యం నెరవేరుతుందనే భరోసాతో ఉన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరేందుకు వచ్చిన పలువురు నేతలు గతంలో విదర్భ, మరాఠ్వాడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పోరాటాలు జరిగాయని, కానీ, అనేక కారణాలతో నిలిచిపో యాయని తెలిపారు. కేసీఆర్‌ లాంటి నేత తమ ఉద్యమానికి మద్దతు ఇస్తే ప్రత్యేక రాష్ట్రం సాధించగలమనే నమ్మకం ఉందన్నారు. గతంలో నాగపూర్‌ రాజధానిగా విదర్బ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమం ఎగిసినప్పటికీ ఆగిపోయింది. ఆ తర్వాత మరాఠ్వాడ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకై తొలి విడత ఉద్యమం అనేక కారణాలతో అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement