మహీంద్రా కంపెనీ తన కొత్త స్కార్పియో ఎన్ను త్వరలోనే దేశంలో లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. జూన్ 27వ తేదీన ఈ కారు ఇండియాలో లాంచ్ కానుంది. అయితే.. దీని ఇంటీరియర్ డిజైన్ ఇప్పుడు ఆన్లైన్లో లీకైంది. దీన్ని బట్టి రానున్న స్కార్పియోలో ఏం ఆశించవచ్చో చర్చ జరుగుతోంది. ఈ కొత్త స్కార్పియోలో ప్రీమియం కేబిన్‌ను అందించారు. ప్రస్తుతం ఉన్న స్కార్పియో కేబిన్ కంటే ఇది మరింత అద్భుతంగా ఉండనుంది. డిజైన్‌ను ఎక్స్‌యూవీ700 ఆధారంగా రూపొందించారు. కొత్త తరహా స్టీరింగ్ వీల్, దాని మీద కొత్త మహీంద్రా లోగోను కూడా చూడవచ్చు.
దీంతోపాటు పెద్ద టచ్‌స్క్రీన్‌ను కూడా అందించనున్నట్టు తెలుస్తోంది. దీని ఇంటీరియర్ కూడా చాలా ఫ్రెష్‌గా, నయా లుక్‌తో ఉన్నాయి. ఎక్స్‌యూవీ700లో ఉపయోగించిన టెక్నాలజీనే దీంట్లోనూ అందించారు. పెద్ద టచ్‌స్క్రీన్, ప్రీమియం ఫీచర్లు ఈ కొత్త స్కార్పియోలో ఉండనున్నాయి.. ఇక స్పేస్‌పై కూడా మహీంద్రా ఈసారి ప్రత్యేక ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత తరం మోడల్ కంటే ఎక్కువ స్పేస్ ఇందులో ఉంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌యూవీ700 కంటే కొంచెం తక్కువ పవర్ అవుట్‌పుట్‌ను ఇది అందించనున్నట్టు తెలుస్తోంది.
మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి. దీనిలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉండనున్నాయి. 4×4 సామర్థ్యంతో లగ్జరియస్ టెక్నాలజీ కూడా ఉన్న అతి కొద్ది కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఈ కొత్త స్కార్పియో నిలుస్తుందని ఆటోరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ప్లాట్‌ఫాంపై రూపొందించిన ఈ కారులో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ చాలా కొత్తగా ఉన్నాయి. దీని లుక్ కూడా చాలా మోడర్న్‌గా ఉండనుంది. కొత్త హెడ్‌లైన్స్, కొత్త గ్రిల్, క్రోమ్ అవుట్ లైన్ ఇందులో ఉన్నాయి. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉండనుంది. ప్రస్తుతం ఉన్న స్కార్పియో తరహాలోనే దీంట్లో కూడా ఆఫ్ రోడ్ టఫ్ నెస్ కనిపించింది.