సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మహిళల భద్రత కోసం సేఫ్టీ ఫీచర్లను తీసుకొస్తోంద. ఇప్పుడు మెటా StopNCII.orgని ప్రారంభించినట్లు ప్రకటించింది. దీని ముఖ్య ఉద్దేశం సెన్సిటివ్ ఫొటోలు వైరల్‌గా మారకుండా ఆపడం దీని లక్ష్యంగా తెలిపింది. అంతేకాకుండా మెటా ఉమెన్ సేఫ్టీ హబ్‌ని కూడా పరిచయం చేసింది. అంటే ఇప్పుడు ఈ ఫీచర్ హిందీతో సహా 11 ఇతర భారతీయ భాషలలో అందుబాటులో ఉంటుంది.
సేఫ్టీ హబ్‌లో ఫేస్బుక్లో ఎలా సురక్షితంగా ఉండాలనే దానిపై మహిళలకు చిట్కాలు అందిస్తోంది. దీని కోసం వారు ఎన్నో స్పెషల్ టూల్స్ కూడా పొందుతారు. మెటా ప్లాట్‌ఫారమ్‌ల డైరెక్టర్ కరుణా నైన్ మీడియాతో మాట్లాడుతూ మెటా తీసుకుంటున్న ఈ చొరవ మహిళలకు ఎటువంటి భాషా సమస్యలను ఎదుర్కోకుండా చూస్తుందన్నారు.
“మా అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో సురక్షితమైన ఆన్లైన్ అనుభవాన్ని సృష్టించడానికి.. అందించడానికి మెటా నిబద్ధతలో వినియోగదారుల భద్రత అంతర్భాగంగా ఉంది. అలాగే కొన్ని సంవత్సరాలుగా కంపెనీ ఆన్లైన్ వినియోగదారులను రక్షించడానికి ఎన్నో రకాల టూల్స్ పరిచయం చేసింది. భవిష్యత్తులో మేము వినియోగదారులను రక్షించడానికి ఆన్లైన్ టూల్స్ పరిచయం చేస్తాం’’ అన్నారు. StopNCII.orgకి సంబంధించి కరుణ నైన్ మాట్లాడుతూ ఈ ప్లాట్‌ఫారమ్ ముఖ్య ఉద్దేశం ఒకరి ఫొటోలు వైరల్ కాకుండా అలాగే ఎలాంటి అనుమతి లేకుండా షేర్ చేయడాన్ని నిరోధించడమేనని చెప్పారు.
దీనిపై కంప్లేంట్ చేస్తే ఈ ప్లాట్‌ఫారమ్ ఫిర్యాదుదారుడి ఫొటోలు లేదా సమాచారం తీసుకోదని.. అయితే వివాదాస్పద పోస్ట్‌పై యునిక్ ఐడి ద్వారా చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు. ఫొటోను అప్లోడ్ చేసిన వెంటనే ఫేస్బుక్ ఆటోమేటిక్ టూల్స్ దాన్ని స్కాన్ చేస్తాయి. మెటా ప్లాట్‌ఫారమ్‌లో మహిళల భద్రతను ప్రోత్సహించడానికి సెంటర్ ఫర్ రీసెర్చ్ (CSR), రెడ్ డాట్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం చేసుకుందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..